India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వం తగ్గించిన GSTపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ శుక్రవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపు, తగ్గింపు వలన జరిగే ఆదా గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాలని ఆదేశించారు.
పైడితల్లమ్మ పండగ సందర్భంగా 6 ప్రాంతాల్లో, విజయనగరం ఉత్సవాల సందర్భంగా 15 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి జీవనరాణి శుక్రవారం తెలిపారు. వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందితో 3 షిప్టుల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతాయన్నారు. ఈ ప్రథమ చికిత్స వైద్య శిబిరాల సేవలను ప్రజలు, భక్తులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
పిల్లలకు ఇంటి నుంచే బాధ్యతలు నేర్పాలని, తల్లీదండ్రులే సంస్కారాన్ని నేర్పించి బయటకు పంపిస్తే చెడు పనులు చేయరని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శైలజ పేర్కొన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో 8వ రాష్ట్రీయ పోషణ్ మాసోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆడవారికి ఆపదలు పక్కనే పొంచి ఉంటాయని, తెలిసిన వారి నుంచే ఎక్కువ ముప్పు కలుగుతుందని అన్నారు. ఆడవారి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు.
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా కొల్లిపర మండలంలో పర్యటించారు. కృష్ణా నదికి భారీగా వరద రావడంతో పాటు లంక గ్రామాలకు ఎఫెక్ట్ ఉండడంతో పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులను గమనించారు. బొమ్మువానిపాలెంలో గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతూ, ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనిస్తూ ఉండాలని సబ్ కలెక్టర్ సంజన సింహకు సూచించారు.
అతిగా మద్యం తాగుతున్నాడని తల్లి కొడుకును మందలించడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దవడుగూరు మండలంలో చోటుచేసుకుంది. చిట్టూరు గ్రామానికి చెందిన అనిల్ కుమార్(24) పదేపదే మద్యం తాగుతున్నాడని తల్లి పెద్దక్క మందలించింది. రాత్రి ఇంటి నుంచి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. అనంతపురానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 2 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్లు, శిథిల భవనాలు, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని సూచించింది.
కొబ్బరికాయలకు భారీ స్థాయిలో డిమాండ్ పెరిగింది. దసరా ఉత్సవాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు, పూజల్లో కొబ్బరికాయలు అధికంగా కొబ్బరి కాయలను వినియోగిస్తారు. కేరళ ప్రాంతం నుంచి ప.గో జిల్లాకు కొబ్బరికాయలు దిగుమతి అయ్యేవి. తుఫాన్, వర్షాభావ పరిస్థితులతో అక్కడి నుంచి దిగుమతులు తగ్గడంతో ఈ ప్రాంతంలోని కొబ్బరి చెట్లనుంచి కాయలను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం కాయ ధర 50-70 పలుకుతోంది.
గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులకు చెల్లిస్తున్న సగటు వేతనాన్ని పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం జిల్లాలో ఉపాధిహమీ పథకం అమలుపై తమ ఛాంబర్లో శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెటీరియల్ కాంపోనెంట్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్ఆర్ఎం పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
ఏయూలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన తాత్కాలిక నియామకాలకు పరిపాలన భవనంలో శుక్రవారం ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 10 మందికి పైగా హాజరయ్యారు. శనివారం కూడా ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగుతుంది. ఏయూ డిస్పెన్సరీలో కాంట్రాక్ట్ విధానంలో వీరిని నియమిస్తున్నారు.
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రెండు గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్లు, శిథిల భవనాలు వద్ద ఉండరాదని, సురక్షితప్రాంతాల్లో ప్రజలు ఉండాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.