Andhra Pradesh

News March 17, 2024

అనకాపల్లి: కరెంట్ షాక్‌తో సచివాలయ ఉద్యోగి మృతి

image

దేవరాపల్లి (మం) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ డెక్క చిరంజీవి(32) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు విధినిర్వహణలో భాగంగా ములకలాపల్లి పాలకేంద్రం వద్ద విద్యుత్ స్తంభానికి కట్టిన పోస్టర్‌ను తొలగించాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎస్.ఐ డి.నాగేంద్ర ఘటనా స్థలానికి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

News March 17, 2024

కడప: పోటీకి సిద్ధం.. మరి గెలుపు ఎవరది?

image

ఉమ్మడి కడప జిల్లాలో అభ్యర్థుల ఖరారుతో ఎన్నికల సమరానికి పార్టీలు సిద్ధమయ్యాయి. టీడీపీ 6 స్థానాలను ఇప్పటికే ప్రకటించగా, వైసీపీ శనివారం అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా పూర్తి స్పష్టత వచ్చింది. ఇక ఎన్నికల ప్రచారమే తరువాయి. బద్వేలు, రాజంపేట, కోడూరు, జమ్మలమడుగు స్థానాల్లో TDPతో పొత్తులో ఉన్న జనసేన, బీజేపీకి ఏ సీట్లు వెళ్తాయో చూడాలి. ఏదేమైనా జిల్లాలో పూర్తి స్పష్టతతో పార్టీలు దూసుకుపోతున్నాయి.

News March 17, 2024

బండారు సీటు కోసం టీడీపీ శ్రేణుల ర్యాలీ

image

పెందుర్తి నియోజకవర్గం టీడీపీ టికెట్ మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం సబ్బవరంలో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీడీపీకి నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారని, పొత్తులో భాగంగా ఈ సీటును బండారి కేటాయిస్తే అధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. మేరకు టీడీపీ నాయకులు, బండారు అనుచరులు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

News March 17, 2024

బొప్పూడి బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం

image

చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే టీడీపీ-జనసేన-బీజేపీ బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం చేశారు. 300 ఎకరాల్లో సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఎస్పీజీ నిఘాలో సభా వేదిక, హెలీప్యాడ్ల నిర్మాణం జరుగుతోంది. మోదీ, చంద్రబాబు, పవన్‌లు ప్రత్యేక హెలికాప్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఎండాకాలం కావడంతో సభా సమయంలో అత్యవసర వైద్య సేవల కోసం చిలకలూరిపేటలో ఓ ఆస్పత్రిని సిద్ధం చేశారు.

News March 17, 2024

అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక నేపథ్యం ఇదీ..

image

సుదీర్ఘ రాజకీయ అనుభవం గల రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మొదటిసారిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. 2 పర్యాయాలు మలికిపురం మండలం చింతలమోరి సర్పంచిగా, ఒకసారి పీఏసీఎస్ అధ్యక్షునిగా పనిచేసిన రాపాక 2009, 2019 ఎన్నికల్లో రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం రాపాకను నియమించగా బరిలో ఉన్నారు.

News March 17, 2024

మన్యంలో ఎన్నికల కంట్రోల్ రూం ఏర్పాటు

image

సాధారణ ఎన్నికల దృష్ట్యా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలోను, సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ కార్యాలయంలోను కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు సంబంధిత పిర్యాదులు, సమాచారం అందించవచ్చని ఆయన వివరించారు.

News March 17, 2024

సామాజిక సమీకరణల దృష్ట్యా సీట్లు కేటాయింపు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ సామాజిక సమీకరణాలకు అనుగుణంగా, పార్టీ సీనియార్టీ ప్రధానంగా సీట్ల కేటాయింపు జరిగింది. సామాజికవర్గాల వారీగా కాపులకు 5, క్షత్రియులకు 3, బీసీలకు 2, ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, వెలమకు 1, కమ్మకు 1 స్థానం కేటాయించారు. రెండు పార్లమెంట్‌ స్థానాలను బీసీల్లోని యాదవ, శెట్టిజలిజలకు కేటాయించారు.

News March 17, 2024

లక్కిరెడ్డిపల్లెలో భార్యను హత్య చేసిన భర్త

image

లక్కిరెడ్డిపల్లె మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుర్నూతల పంచాయతీ బొమ్మేపల్లికి చెందిన యోగానందరెడ్డి భార్య రమణమ్మ (32)ను ఆదివారం తెల్లవారుజామున దారుణంగా హత్య చేశాడు. అనంతరం లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌లో యోగానందరెడ్డి లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ గంగానాధ బాబు, ఎస్ఐ విష్ణువర్ధన్ క్లూస్ టీంతో మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 17, 2024

మోదీ చేతిలో టీడీపీ-జనసేన-వైసీపీ కీలు బొమ్మలు: తులసి రెడ్డి

image

రాష్ట్రానికి జగన్, దేశానికి మోదీ రాహుకేతువులుగా తయారయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. డాబా గార్డెన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. మోదీ అప్పులుపాలు చేసి దేశాన్ని తాకట్టు పెడితే.. రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టాడన్నారు. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశన దేశాన్ని బీజేపీ తయారుచేసిందని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోదీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారయని అన్నారు.

News March 17, 2024

విజయనగరం: అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష

image

అత్యాచారం కేసులో నిందితుడికి జిల్లా 5వ అదనపు జడ్జి మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమాన విధించినట్లు దిశ ఇన్‌ఛార్జ్ డీఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భోగాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన సీహెచ్ ఈశ్వరరావు 2022 ఏప్రిల్ 29న అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన కోర్టు పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.