Andhra Pradesh

News March 17, 2024

కడప జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ అధికారి నియామకం

image

కడప జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ అధికారిగా నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్‌ను నియమించినట్టు జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కడప కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నేతలు 08562 315672 ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

News March 17, 2024

ఫ్లెక్సీలు ధ్వంసం చేశారని డీఎస్పీకి ఫిర్యాదు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రు పరిధిలోగల మన్నా జూబ్లీచర్చ్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని యునైటెడ్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సంఘం నాయకులు డీఎస్పీ ఉమామహేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్చ్‌ పాస్టర్‌ అల్లవరం పోలీస్‌లకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పాస్టర్లు డీఎస్పీని కోరారు.

News March 17, 2024

నేడు పోలీస్ యాక్ట్ 30 అమలు: ఏలూరు ఎస్పీ

image

ఏలూరు జిల్లాలో ఆదివారం ఉ.10 నుంచి 12 గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సా.4 గంటల వరకు గ్రూప్-1 పరీక్షలు పకడ్బందీగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్ష కేంద్రాల పరిధిలో ఏవైనా సమస్యలు ఎదురైతే 100 నెంబర్‌కు కాల్ చేయాలన్నారు. 94409 04808 కు వాట్సాప్‌లో సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.

News March 17, 2024

శ్రీకాకుళం: జాతీయ లోక్ అదాలత్‌లో 1782 కేసులు పరిష్కారం

image

శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, ఇచ్చాపురం కోటబొమ్మాలి, నరసన్నపేట పాలకొండ, పలాస, పాతపట్నం రాజాం, సోంపేట, టెక్కలి, కొత్తూరు పొందూరు కోర్టులలో జరిగిన జాతీయ లోక్‌ అదాలత్ మొత్తం 1782 కేసులు రాజీ అయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేసినందుకు అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

News March 17, 2024

నెల్లూరు: ఎన్నికల ఫిర్యాదుల సహాయం కేంద్రం ఏర్పాటు

image

ఎన్నికల పక్రియ పై ఫిర్యాదు, సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణ తెలిపారు. 2024 ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 8 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల సౌకర్యార్థం కోసం హెల్ప్ లైన్ 1950 తోపాటు 0861- 2349402, 2349403, 2349404 ఫోన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వారు తెలిపారు.

News March 17, 2024

కడప: ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

image

కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ విజయరామ రాజు పేర్కొన్నారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 16.22 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, పురుషులు 7.92 లక్షలు, మహిళలు 8.29 లక్షల మంది, 214 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారన్నారు. 2035 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశామన్నారు.

News March 17, 2024

ఎన్నికలలో పోలీసులు చేయాల్సిన విధులపై ప్రత్యేక శిక్షణ: డీఎస్పీలు

image

త్వరలో జరగనున్న ఎన్నికల విధివిధానాల, విధుల పట్ల పోలీస్ సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని డీఎస్పీలు శ్రీలత, శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం కదిరి సబ్ డివిజన్ పరిధిలోని సీఐ, ఎస్సై, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులకు ఎన్నికల విధులపై కదిరిలో ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎలక్షన్ సెల్ పోలీస్ సిబ్బందికి త్వరలో జరగనున్న ఎన్నికలలో పోలీసులు పాటించాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పించారు.

News March 17, 2024

ప్రకాశం: గ్రూప్-1 పరీక్షకు పటిష్ట బందోబస్తు

image

రేపు నిర్వహించనున్న గ్రూప్ -1 స్క్రీనింగ్ టెస్ట్‌కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 9 కేంద్రాల్లో మొత్తం 6,116 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష రోజున జిల్లా వ్యాప్తంగా సెక్షన్-30 పోలీస్ యాక్టు అమలులో ఉంటుందన్నారు.

News March 17, 2024

ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ విడుదల: కలెక్టర్ ఢిల్లీరావు

image

ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా నేడు జారీచేసిన షెడ్యూల్ ప్రకారం 2024 సాధారణ ఎన్నికల 4వ దశలో జిల్లాలోని విజ‌య‌వాడ పార్ల‌మెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు శనివారం తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 

News March 17, 2024

గుంటూరు: ‘ఉద్యోగులు పార్టీలకు అనుకూలిస్తే చర్యలు’

image

సార్వత్రిక ఎన్నికల కోడ్ శనివారం నుంచి అమలులో ఉంటుందని నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం కమీషనర్ తన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా, ఆయా పార్టీల నిర్వహించే ప్రచారాలలో పాల్గొన్నా.. ఎన్నికల నిబంధన ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.