Andhra Pradesh

News March 17, 2024

నెల్లూరు: ఆరుగురు ఇంజినీర్లు.. ఓ CA

image

నెల్లూరు జిల్లా అభ్యర్థుల్లో పలువురు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. నేదురుమల్లి(వెంకటగిరి), సంజీవయ్య(సూళ్లూరుపేట), ఆదాల (నెల్లూరు రూరల్), రామిరెడ్డి(కావలి), కాకాణి(సర్వేపల్లి), విక్రం రెడ్డి(ఆత్మకూరు) ఇంజినీరింగ్ చదివారు. ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఛార్టెర్డ్ అకౌంటెంట్. ప్రసన్న(కోవూరు), రాజగోపాల్ రెడ్డి(ఉదయగిరి), మురళీధర్(గూడూరు) డిగ్రీ పూర్తి చేయగా, ఖలీల్(నెల్లూరు సిటీ) ఇంటర్ చదివారు.

News March 17, 2024

జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ రూమ్ ఏర్పాటు చేశామని తక్షణమే దాని సేవలు అందుబాటులోకి వస్తాయని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం సమాయత్తంగా ఉందని పేర్కొన్నారు. ప్రక్రియను పర్యవేక్షించేందుకు క్షేత్ర స్థాయిలో ఎన్సీసీ బృందాలు ఉన్నాయని పేర్కొన్నారు.

News March 17, 2024

లండన్‌లో చదివి చిత్తూరు జిల్లాలో పోటీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా MP, MLA అభ్యర్థుల్లో పలువురు విదేశాల్లో చదివారు. భూమన అభినయ్(తిరుపతి), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(చంద్రగిరి), మిథున్ రెడ్డి(రాజంపేట ఎంపీ) లండన్‌లో MS, MBA పూర్తి చేశారు. నిసార్ అహ్మద్(మదనపల్లె), భరత్(కుప్పం) ఇద్దరూ ఇంజినీర్లు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి MA PhD చేశారు. పూతలపట్టు అభ్యర్థి సునీల్ డాక్టర్. మిగిలిన అభ్యర్థులందరూ మినిమం డిగ్రీ పూర్తి చేశారు.

News March 17, 2024

కాకినాడ: 3 సార్లు ఓటమి.. ఇప్పడు YCP నుంచి గెలిచేనా..? 

image

కాకినాడ ఎంపీ వైసీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పోటీ చేయనున్నారు. ఈయన విదేశాల్లో చదివిన ఈయన పారిశ్రామికవేత్త. 2009 (ప్రజారాజ్యం), 2014 (వైసీపీ), 2019 (టీడీపీ) నుంచి కాకినాడ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత మళ్లీ వైసీపీలో చేరారు. ఇప్పుడు మరోసారి వైసీపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మరి ఆయన విజయం సాధించేనా..?- మీ కామెంట్..?

News March 17, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో 1,513 కేసులు పరిష్కారం

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆధ్వర్యంలో 64 బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,513 కేసులను పరిష్కరించారు. బాధితులకు రూ.2.30 కోట్ల నష్టపరిహారం అందజేశారు.

News March 17, 2024

శ్రీకాకుళం: టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

image

ఈ నెల18వ తేదీ నుంచి 30 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.విజయ కుమార్ శనివారం తెలిపారు. విద్యార్థులు ఇంటి వద్ద నుంచి పరీక్ష కేంద్రం వరకు అన్ని పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News March 17, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో భారీ మార్పులు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ భారీ మార్పులు చేసింది. ఉమ్మడి గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా 9 స్థానాలకు అభ్యర్థులను మార్చింది. తాడికొండ, మంగళగిరి, వేమూరు, పొన్నూరు, రేపల్లె, పత్తిపాడు, చిలకలూరిపేట, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ నుంచి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. మాచర్ల, నరసరావుపేట, గురజాల, పెదకూరపాడు, తెనాలి, బాపట్ల, సత్తెనపల్లి, వినుకొండలో పాత అభ్యర్థులనే పోటీకి ఉంచింది.

News March 17, 2024

అనంత: రేపు కలెక్టరేట్‌లో ‘స్పందన’ రద్దు

image

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఎం.గౌతమి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి తదుపరి జరగబోయే స్పందన కార్యక్రమం తేదీని ప్రకటిస్తామన్నారు. ఇందుకు జిల్లాలోని ప్రజలందరూ సహకరించాలని కోరారు.

News March 17, 2024

అనకాపల్లి ఎంపీ సీటు.. ఆ బీసీ ఎవరు?

image

అనకాపల్లి MP అభ్యర్థి పేరును వైసీపీ పెండింగ్ పెట్టింది. కూటమి అభ్యర్థిగా BJP నుంచి సీఎం రమేశ్ ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరగడంతో ధీటైన అభ్యర్థి కోసం వైసీపీ అన్వేషిస్తున్నట్లు సమాచారం. మాడుగుల MLA అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును MP అభ్యర్థిగా ప్రకటించి, అక్కడ నుంచి బూడి కుమార్తె, ZPTC ఈర్ల అనురాధని పోటీ పెడతారని ప్రచారం జరుగుతోంది. మరి వైసీపీ అభ్యర్థిగా ఆ బీసీ నేత ఎవరి మీరు భావిస్తున్నారు? 

News March 17, 2024

ప.గో.: 9వ తరగతి చదివి వైసీపీ MLA అభ్యర్థిగా

image

ప.గో. జిల్లాలో వైసీపీ అభ్యర్థుల చదువులు ఇలా..
చెరుకువాడ శ్రీరంగనాథరాజు- 9వ తరగతి
కొట్టు సత్యనారాయణ – ఇంటర్
గుడాల శ్రీహరిగోపాల రావు – బీకాం
పెన్మెత్స వెంకట లక్ష్మీ నర్సింహరాజు – బీఏ
గ్రంథి శ్రీనివాస్ – ఇంటర్
ముదునూరి నాగరాజ వరప్రసాదరాజు – ఇంటర్
ఆళ్ల నాని – బీకాం
తానేటి వనిత – MSC (PHD)
అబ్బయ్య చౌదరి – బీటెక్
కంభం విజయరాజు – BA, ఎల్ఏఈ
తెల్లం రాజ్యలక్ష్మి- BA, బీఈడీ
పుప్పాల శ్రీనివాసరావు – డిగ్రీ