News March 17, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో భారీ మార్పులు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ భారీ మార్పులు చేసింది. ఉమ్మడి గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా 9 స్థానాలకు అభ్యర్థులను మార్చింది. తాడికొండ, మంగళగిరి, వేమూరు, పొన్నూరు, రేపల్లె, పత్తిపాడు, చిలకలూరిపేట, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ నుంచి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. మాచర్ల, నరసరావుపేట, గురజాల, పెదకూరపాడు, తెనాలి, బాపట్ల, సత్తెనపల్లి, వినుకొండలో పాత అభ్యర్థులనే పోటీకి ఉంచింది.

Similar News

News March 13, 2026

గుంటూరు: ఈ నంబర్‌తో పోలీస్ సేవలు..!

image

గుంటూరు జిల్లా ప్రజలు మన మిత్ర – వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని సందేశం పంపితే FIR కాపీ, కేసు స్థితి, ఈ-చలానా వివరాలు వంటి పోలీస్ సేవలు మొబైల్‌లోనే పొందవచ్చన్నారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదులకు 1930, అత్యవసర పోలీస్ సహాయానికి 112 కు కాల్ చేయాలని సూచించారు.

News March 13, 2026

GMCలో అవినీతికి పాల్పడ్డ సెక్రటరీ సస్పెండ్

image

అవినీతికి పాల్పడిన గుంటూరు నగరపాలక సంస్థ సెక్రటరీ ఎ.పవన్ కుమార్ పై గురువారం సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేయాలని అధికారులను నగర కమిషనర్ కె. మయూర్ అశోక్‌ను కోరారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్ము (ఆస్తి పన్ను, LRS) సొంతానికి వాడుకోవడం, తక్కువ మొత్తానికి నకిలీ రశీదులు సృష్టించి ప్రభుత్వం, ప్రజలను మోసం చేయడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 13, 2026

కలెక్టర్ల సదస్సులో గుంటూరు కలెక్టర్, ఎస్పీ

image

అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో CM చంద్రబాబు జిల్లాల కలెక్టర్, SPలకు కీలక సూచనలు చేశారు. ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైనది ఏదీ లేదని పేర్కొంటూ రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ పాటించాలని స్పష్టం చేశారు.