Andhra Pradesh

News June 2, 2024

యనమలకుదురులో గర్భిణి సూసైడ్

image

విజయవాడ శివారు యనమలకుదురులో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. కావ్య అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. కావ్య ఐదు నెలల గర్భవతిగా ఉందని ఇటీవల భర్త స్కానింగ్ చేయించాడు. ఆడపిల్లని తేలడంతో భర్త అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అది ఇష్టంలేని కావ్య ఆత్మహత్య చేసుకుందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

News June 2, 2024

కడప జిల్లాలో 2500 మందితో భారీ బందోబస్తు: ఎస్పీ

image

ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు కడప ఎస్పీ తెలిపారు. జిల్లాలో కేంద్ర బలగాలతో సహా 2500 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా డే అండ్ నైట్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తారని, 55 పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. గొడవలు సృష్టించిన, పాల్పడినవారు జిల్లా బహిష్కరణకు గురవుతారని హెచ్చరించారు.

News June 2, 2024

ఒంగోలు: జన శతాబ్ది రైలు దారి మళ్లింపు

image

గుంటూరు – కృష్ణాకెనాల్ జంక్షన్ మధ్య రోలింగ్ కారిడార్ బ్లాక్ పనుల కారణంగా ఈ నెల 1 నుంచి 14వ తేదీ వరకు జన శతాబ్ది రైలును దారి మళ్లించినట్లు గుంటూరు డీఆర్ఎం రామకృష్ణ పేర్కొన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ (గుంటూరు) వెళ్లడానికి ఈ రైలును ఎక్కువగా వినియోగించుకుంటారు. జన శతాబ్ది ఎక్స్ప్రెస్ ను తెనాలి నుంచి నేరుగా విజయవాడకు మళ్లిస్తామన్నారు.

News June 2, 2024

ప.గో: గ్రామస్థులు కొట్టారని లెటర్ రాసి లైన్‌మెన్ అదృశ్యం

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరానికి చెందిన లైన్‌మెన్ N.శ్రీనివాసరావు శనివారం తెల్లవారుజాము నుంచి కనిపించడం లేదని తోటి ఉద్యోగులు తెలిపారు. గ్రామంలో శుక్రవారం ఓ విద్యుత్ స్తంభం ఎక్కి దిగేటప్పుడు సెటప్ బాక్స్ కింద పడిపోవడంతో స్థానికులు అతడితో వాగ్వాదానికి దిగారన్నారు. పలువురు శ్రీనివాసరావుపై దాడి చేసినట్లు తెలిపారు. మనస్తాపానికి గురైన శ్రీను లెటర్ రాసి కనిపించకుండా పోయాడని చెబుతున్నారు.

News June 2, 2024

శ్రీకాకుళం: కౌంటింగ్ డే.. కేంద్రాలకు చేరుకోవాల్సిన మార్గాలివే..!

image

ఎచ్చెర్లలో శ్రీశివాని కళాశాలలో 4న ఓట్ల లెక్కింపు కేంద్రాలకు కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్స్ వారికి నిర్దేశించిన మార్గాల్లోనే చేరుకోవాలని ఎస్పీ రాధిక ఆదివారం తెలిపారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల అసెంబ్లీలకు చెందిన వారు గేట్ నం-1 నుంచి ఫార్మసీ బ్లాక్ కౌంటింగ్ సెంటర్‌కు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, పాతపట్నం గేట్ నం-II నుంచి IIIT బ్లాక్ కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకోవాలన్నారు.

News June 2, 2024

పల్నాడు: పెట్రోల్ బాంబుల ముడి సామగ్రి స్వాధీనం

image

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. ఆదివారం పోలీసులు గ్రామంలో తనిఖీలు నిర్వహించగా.. ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తి గడ్డివామిలో నిల్వ చేసి ఉంచిన సుమారు 5 లీటర్ల పెట్రోలు, 18 సీసాలు, 9 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముడి సామగ్రికి సంబంధించిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 2, 2024

గుడిపాల ఎస్ఐ శ్రీనివాసరావు సస్పెండ్

image

చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐపై వేటు పడింది. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలో పోలింగ్ రోజున ఘర్షణలు జరిగాయి. ఎస్ఐ శ్రీనివాసరావు అలసత్వం కారణంగానే ఘర్షణ చెలరేగినట్లు జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌కు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషనర్‌కు నివేదిక పంపారు. దీంతో ఎస్ఐ సస్పెండ్‌కు సంబంధించిన ఉత్తర్వులు ఇవాళ వెలువడ్డాయి.

News June 2, 2024

జూన్ 5 వరకు మద్యం షాపులు బంద్: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లా పరిధిలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రేపటి నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున తెలిపారు. ఎన్నికల కోడ్ ఈనెల 6వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు మద్యం షాపులను మూసివేస్తున్నామన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, అదే విధంగా కౌంటింగ్ కూడా శాంతియుతంగా పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరారు.

News June 2, 2024

అవినాశ్ రెడ్డి హ్యాట్రిక్ విజయం ఖాయమేనా?

image

కడప పార్లమెంట్ ఫలితంపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఇప్పటికే అవినాశ్‌రెడ్డి రెండు సార్లు MPగా విజయం సాధించారు. తొలుత 1.90 లక్షల పైగా ఓట్లతో విజయం సాధించగా, 2019లో ఏకంగా 3.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరోసారి విజయం సాధిస్తారని విశ్లేషకులు అంటుండగా, అందుకు తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉన్నాయి. మరి అవినాశ్ హ్యాట్రిక్ సాధిస్తారా లేక ఎగ్జిట్ పోల్స్‌ని కాదని వేరే వ్యక్తి గెలుస్తారో చూడాలి.

News June 2, 2024

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. హోంగార్డ్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. హోంగార్డ్ భాస్కరరావు కొంత కాలంగా రేంజ్ ఐజీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజులుగా బందోబస్తు విధులకు హాజరవుతున్నాడు. శనివారం రాత్రి విధులకు హాజరై తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా నల్లపాడు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.