News March 17, 2024
మచిలీపట్నం: బ్యానర్‌పై పేర్ని నాని.. స్టేజిపై కొల్లు రవి

కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం, యువజన విభాగం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం మచిలీపట్నంలో నిర్వహించారు. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని ఫోటో బ్యానర్‌పై కనిపించగా అదే వేదికపై పేర్ని నాని రాజకీయ ప్రత్యర్థి కొల్లు రవీంద్ర పాల్గొని ప్రసంగించారు. బ్యానర్‌లో ఒకరు, వేదికపై ఒకరిని చూసిన అక్కడున్న వారు పొలిటికల్ కామెంట్స్ చేసుకున్నారు.
Similar News
News March 17, 2026
సంక్షేమ వసతి గృహాలపై కృష్ణా కలెక్టర్ సమీక్ష

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల పురోగతిపై మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో సమీక్షించారు. 61 హాస్టళ్ల అభివృద్ధికి రూ.10.35 కోట్లు మంజూరు కాగా, రూ.5 కోట్లతో 46 హాస్టళ్లలో పనులు పూర్తయ్యాయన్నారు. తాగునీరు, ఆహార నాణ్యతపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News March 17, 2026
కృష్ణా: 82 అంగన్వాడీ పోస్టులకు నేడే చివరి తేదీ

కృష్ణా జిల్లాలోని బందరు, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం, అవనిగడ్డ ప్రాజెక్టులలో మొత్తం 82 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 21-35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహిత మహిళలు అర్హులన్నారు. ఈ నెల 17లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాలను సంప్రదించాలని పేర్కొన్నారు.
News March 17, 2026
కృష్ణా: వారికి నేడే ఆఖరి రోజు!

జిల్లాలోని మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు నేడు చివరి రోజు కానుంది. దీంతో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాలనకు ముగింపు పలుకుతూ, రేపటి నుంచి పట్టణ పరిపాలన పూర్తిగా ప్రభుత్వ నియమిత ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల నియామకానికి మార్గదర్శకాలు జారీ చేసి అధికారులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో పరిపాలన కొనసాగింపు బాధ్యతలు అధికారులు చేపట్టనున్నారు.


