India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మరికొద్దిసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధానమంత్రి మోదీ చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆయన చిలకలూరిపేట మండలం బొప్పూడి సభకు చేరుకుంటారు. సభా ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలోనే హెలీ ప్యాడ్ ఉంది. మోదీ సభ వద్దకు సులభతరంగా వచ్చే విధంగా ఏర్పాటు చేశారు.

నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 17 సంవత్సరాల యువతి ఆదివారం అనుమానాస్పదంగా మృతిచెందింది. ఫ్యాను హుక్‌కి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినతరం చేయాలని కలెక్టర్ లోతేటి శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఎన్నికల నివేదికల సమర్పణ సి.విజిల్, సువిదయాప్, తదితర అంశాలపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో జాయింట్ కలెక్టర్‌తో కలిసి కలెక్టర్ సమీక్ష చేశారు.

పాయకరావుపేట మండలం వెంకటనగరం తీరంలో ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు, బోటు బోల్తా పడడంతో మృతి చెందాడు. రాజానగరం గ్రామానికి చెందిన గరికిన కొత్తబాబు తన కుమారుడు, మరో వ్యక్తితో కలిసి వెంకటనగరం రేవులో చేపల వేటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం పడవ బోల్తా పడడంతో కొత్తబాబు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారాన్ని ఫిషరీస్ అధికారులకు తెలియజేశామన్నారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఎన్నికల కంట్రోల్ రూమ్‌ను ఆదివారం కలెక్టర్ శివశంకర్ పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించిన యాప్‌లు ఏవీ ఎలా మానిటర్ చేయాలని సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ విభాగంలో పనిచేసే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి వారికి నిర్దేశించిన ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెప్పారు.

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం వచ్చిన ఆదాయాన్ని అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.3,02,300, పూజలు, విరాళాల రూపంలో రూ.88,790, ప్రసాదాల రూపంలో రూ.1,92,006, శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవోఎస్ చంద్రశేఖర్ తెలిపారు. సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు.

ఎలక్షన్ కోడ్ ప్రకటించడంతో ప్రభుత్వ పథకాల్లో రాజకీయ నాయకుల ఫొటోలకు చెక్ పెట్టారు. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న చిక్కీలపై ఉన్న ఫోటోలను తొలగించారు. రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా చిక్కీలను మాత్రమే విద్యార్థులకు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు HMలకు ఆదేశాలు జారీ చేశారు.

నార్పల మండలంలోని గూగుడు గ్రామంలో శనివారం రాత్రి పొలం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బైక్‌కు నిప్పు పెట్టగా పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దివంగత MP ఆదికేశవులు నాయుడు కుమారుడు DA శ్రీనివాస్ హైదరాబాద్‌లో చంద్రబాబును కలవడం ఆసక్తి మారింది. ఇటీవల ఆయన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల్లో చేరుతారని వివధ రకాలు వార్తలు వచ్చాయి. చిత్తూరులో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన శ్రీనివాస్ ఆ తర్వాత కనిపించలేదు. అప్పట్లో పెద్దిరెడ్డిని కలిసిన ఆయన నేడు చంద్రబాబుతో భేటి కావడం ఆసక్తి రేపుతోంది.

నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. ప్లాట్ ఫాం-1పై హెటెన్షన్ వైర్ తెగిపడింది. దీంతో రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఘటన సమయంలో పట్టాలపై రైలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు.
Sorry, no posts matched your criteria.