News March 17, 2024

పాయకరావు పేట: బోటు బోల్తా పడి వ్యక్తి మృతి

image

పాయకరావుపేట మండలం వెంకటనగరం తీరంలో ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు, బోటు బోల్తా పడడంతో మృతి చెందాడు. రాజానగరం గ్రామానికి చెందిన గరికిన కొత్తబాబు తన కుమారుడు, మరో వ్యక్తితో కలిసి వెంకటనగరం రేవులో చేపల వేటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం పడవ బోల్తా పడడంతో కొత్తబాబు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారాన్ని ఫిషరీస్ అధికారులకు తెలియజేశామన్నారు.

Similar News

News February 15, 2025

విశాఖలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు శనివారం గంజాయి రవాణా నియంత్రణలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా అరికట్టడానికి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ ఆఫీసులు, పలు చోట్ల డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News February 15, 2025

ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకుందాం: కలెక్టర్

image

ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుని ఆహ్లాద‌క‌ర‌ వాతావ‌ర‌ణంలో ప‌ని చేద్దామ‌ని స్వ‌చ్ఛ ఆంధ్ర – స్వ‌చ్ఛ దివ‌స్ కార్య‌క్ర‌మంలో భాగంగా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్.హరేంధిర ప్ర‌సాద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌దర్శ‌కాల‌కు అనుగుణంగా ఫిబ్ర‌వ‌రి నెల 3వ శ‌నివారం జిల్లాలోని అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, క‌ళాశాలలు, పాఠ‌శాల‌లు, ఇత‌ర‌ సంస్థ‌ల ప‌రిధిలో అధికారులు, సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నాట్లు ఆయన తెలిపారు.

News February 15, 2025

విశాఖలో జీబీఎస్ కలకలం.. ఐదు కేసులు నమోదు

image

విశాఖలో గులియన్ బారే సిండ్రోం (జీబీఎస్) కేసులు నమోదు కావడం కలకలం రేపింది. గడచిన నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు ఈ సమస్యతో కేజీహెచ్‌లో చేరారు. ప్రస్తుతం జనరల్ మెడిసిన్ విభాగంలోని ఎక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లో వీరు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే పూర్తిగా కోలుకునేవరకు తమ పర్యవేక్షణలో సేవలు అందిస్తున్నట్లు కేజీహెచ్ వైద్యులు తెలిపారు.

error: Content is protected !!