India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్లతోటల పెంపకానికి 100% రాయితీ ఇస్తున్నామని కడప జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిశేషారెడ్డి తెలిపారు. ఈనెలాఖరు వరకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పథకం కింద మామిడి, జామ, నిమ్మ పంటలు సాగు చేసుకోవచ్చన్నారు.
ఈనెల 25 నుంచి 26 వరకు పల్నాడు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల ఆట్యాపాట్యా పోటీలలో ఫైనల్స్‌లో కర్నూలు జిల్లా జట్టు పల్నాడు జట్టుపై 20-16 తేడాతో ఓడి ద్వితీయ స్థానంలో నిలిచినట్లు జిల్లా సంఘం సీఈవో నాగరత్నమయ్య తెలిపారు. లీగ్ దశలో మంచి ప్రతిభ చూపి ఫైనల్‌కు చేరుకొని పోరాడి ఓడిందన్నారు. టీమ్ శిక్షకుడిగా చరణ్ వ్యవహరించారు.
యోగి వేమన విశ్వవిద్యాలయంలోని ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంచాలకుడు డా. లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ ఇంటర్మీడియట్ విద్యార్థులు దీనికి అర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఉపాధ్యాయులు తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్షిటీని సంప్రదించాలన్నారు.
జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న NMR, మజ్దూర్ వర్కర్లకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కనీస వేతనాలు పెంచుతున్నట్టు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 16న నిర్వహించిన కనీస వేతనాల పెంపునకు సంబంధించి కమిటీ సభ్యుల సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ధరల పెరుగుదల వ్యత్యాసాన్ని అనుసరించి వేతనాలను పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి మెసానికల్ గ్రౌండ్ వరకు 2K రన్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. వ్యాసరచన, వకృత్వపు పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు బాధ్యతలు కేటాయించామన్నారు.
ఆధార్‌లో తప్పులను సవరించుకునేందుకు శ్రీకాకుళం, టెక్కలి, ఆమదాలవలస పోస్టు ఆఫీసులో కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నామని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ హరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు ఈ సేవలు కల్పిస్తున్నామన్నారు. నూతన ఆధార్ కార్డుతో పాటు అడ్రస్ డేట్ అఫ్ బర్త్ కరెక్షన్, ఐరిష్, బయోమెట్రిక్ తదితర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
కడప జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరిలో అక్టోబర్ 7వ తేదీన గిరిప్రదక్షణ జరగనుంది. సంబంధిత కరపత్రాలను పుష్పగిరి తీర్థయాత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు సట్టి భారవి సిద్ధవటం జ్యోతిక్షేత్రంలో శుక్రవారం ఆవిష్కరించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కేసీపీ షుగర్స్ 2025-26 క్రషింగ్ సీజన్‌కు చెరకు ధర ప్రకటించింది. టన్నుకు రూ.400 సబ్సిడీతో కలిపి, చెరకు ధరను రూ.3,690గా నిర్ణయించినట్లు యూనిట్ హెడ్ యలమంచిలి సీతారామదాస్ తెలిపారు. యాంత్రీకరణకు అనువుగా సాగుచేసే రైతులకు టన్నుకు అదనంగా రూ.100 ఇస్తామన్నారు. ఈ సీజన్‌లో నాటే చెరకు మొక్క తోటలకు ఎకరాకు రూ.10 వేలు సబ్సిడీ, రూ.20 వేలు వడ్డీ లేని రుణం అందిస్తామని ప్రకటించారు.
విద్యార్థి మణికంఠతో మృతితో ఏయూలో సమస్యలు పరిష్కరించాలంటూ చేస్తున్న నిరసనను విద్యార్థులు విరమించారు. హామీలు నెరవేరుస్తామని వీసీ, జిల్లా అధికార బృందం జరిపిన చర్చలు సఫలం కావడంతో విద్యార్థులు వెనక్కితగ్గారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం త్రీమెన్ కమిటీ నియమిస్తామన్నారు. DMHO, KGH సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను అక్టోబర్ 10వ తేదీ లోపు ఏర్పాటు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం (M) మాధవరం కమ్యూనిటీ హాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఆర్ఎస్కేలలో నిర్ధారించిన తేమ శాతం మాత్రమే పరిగణలోకి తీసుకుంటామన్నారు. సర్పంచ్ ముప్పిడి సూర్యకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి నారాయణరావు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.