India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సులకు నిర్వహించిన మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను శనివారం ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్ విడుదల చేశారు. ఫలితాలను విశ్వ విద్యాలయ వెబ్ సైట్ నుంచి పొందవచ్చని తెలియజేశారు. మొత్తం 9679 మంది పరీక్షలు రాయగా 6494 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. సందేహాలుంటే రీవాల్యుయేషన్‌కు ఈనెల 30వ తేదీలోగా ఒక్కో పేపర్‌కు రూ. 1240లను చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల ఖరారుతో ఎన్నికల సమరానికి పార్టీలు సిద్ధమయ్యాయి. టీడీపీ 10 స్థానాలను ఇప్పటికే ప్రకటించగా, వైసీపీ శనివారం అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా పూర్తి స్పష్టత వచ్చింది. ఇక ఎన్నికల ప్రచారమే తరువాయి. చీరాల, దర్శి స్థానాలను టీడీపీ ఇంకా ప్రకటించనప్పటికీ అక్కడ పొత్తులోభాగంగా ఎవరికి సీట్లు వస్తాయో చూడాలి. ఏది ఏమైనా జిల్లాలో పూర్తి స్పష్టతతో పార్టీలు దూసుకుపోతున్నాయి.

ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్ర బోయిన వెంకటేశ్వరరావు ప్రయాణమెటని నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. రాజ్యసభ సభ్యులు వై. వి. సుబ్బారెడ్డిని కలిసిన ముద్రబోయిన, నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సీటు వస్తుందని నియోజకవర్గంలోని ముద్ర బోయిన ఆత్మీయులు భావించారు. కానీ శనివారం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పారావు పేరును ప్రకటించారు.

కర్నూలు జిల్లా YCPలో భారీగా MLA, MP అభ్యర్థుల మార్పులు చోటు చేసుకున్నాయి. నంద్యాల జిల్లాలో నందికొట్కూరు MLA అభ్యర్థిని మాత్రమే CM జగన్ మార్చారు. కాగా కర్నూలు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు గాను నలుగురు MLA, MP అభ్యర్థిని మార్చడం చర్చనీయాంశంగా మారింది. MP అభ్యర్థి బీవై రామయ్యతో పాటు, ఇంతియాజ్, బుట్టా రేణుక, డా.సతీష్, విరూపాక్షి MLA అభ్యర్థిత్వానికి కొత్తవారు కావడం గమనార్హం.

హిందూపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా జోలదరాశి శాంతను ప్రకటించింది. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఆమె ఇంటర్ మీడియట్ వరకు చదువుకుంది. 2009 నుంచి 2014 వరకు బీజేపీ తరపున బళ్లారి పార్లమెంట్ సభ్యురాలిగా పని చేశారు. ఆమె సోదరుడు శ్రీరాములుకు కూడా గతంలో కర్ణాటక మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. రాజకీయ సమీకరణాలలో వైసీపీ ఆమెకు టికెట్ కేటాయించింది.

ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నుంచి బెందళం, పిరియా కుటుంబాల మధ్య మరోసారి పోటీ పడనున్నాయి. 2019 ఎన్నికల్లో ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి బెందళం అశోక్ బాబు పోటీ చేయగా వైసీపీ నుంచి పిరియా సాయిరాజ్ పోటీ చేశారు. అశోక్ గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి బెందళం అశోక్ పోటీకి సిద్ధం కాగా పిరియా సాయిరాజ్ భార్య విజయ పోటీ పడనున్నారు.

కాశినాయన మండలంలోని నరసాపురంలో అనుమానాస్పద స్థితిలో సాధువు ఆదివారం మృతి చెందడం స్థానికులు గుర్తించారు. నరసాపురం సమీపంలోని అంకాలమ్మ రాతి శిలల సమీపంలో కత్తితో పొడుచుకొని సాధువు మృతిచెందినట్లు స్థానికులు చెప్తున్నారు. జ్యోతి క్షేత్రంలో ఉండే సాధువు శనివారం నరసాపురం ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో చూపించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బొబ్బిలిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ఎస్.అనిల్ (30) కొన్నేళ్ల కిందట కొత్తపెంటలో బెల్లం ఆడించే పని కోసం తండ్రితో వచ్చాడు. పని పూర్తి కావడంతో ఇంటికి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న ఆవుని అనిల్ అమ్మేశాడు. తక్కువ ధరకు అమ్మాడని తండ్రి కోప్పడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్నీ న్యాయస్థానాల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 980 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. భారతి తెలిపారు. పరిష్కారమైన వాటిలో 800 క్రిమినల్, 140 సివిల్, 40 ప్రీ లిటిగేషన్ కేసులు ఉన్నాయని, రూ.కోటికి పైగా నగదు చెల్లించుకునే విధంగా కక్షిదారుల మధ్య అవగాహన కుదిరినట్లు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14,61,338 మంది ఓట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మహిళలు అత్యధికంగా 7,44,308, పురుషులు 7,16,956 మంది, థర్డ్ జెండర్స్ 74 మంది ఉన్నారు. మొత్తంగా 1,463 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.