News March 17, 2024
కాశినాయన: కత్తి పోట్లతో సాధువు మృతి
కాశినాయన మండలంలోని నరసాపురంలో అనుమానాస్పద స్థితిలో సాధువు ఆదివారం మృతి చెందడం స్థానికులు గుర్తించారు. నరసాపురం సమీపంలోని అంకాలమ్మ రాతి శిలల సమీపంలో కత్తితో పొడుచుకొని సాధువు మృతిచెందినట్లు స్థానికులు చెప్తున్నారు. జ్యోతి క్షేత్రంలో ఉండే సాధువు శనివారం నరసాపురం ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో చూపించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Similar News
News October 14, 2024
కడప: ఉచితంగా డీఎస్సీ శిక్షణా కార్యక్రమం
కడప జిల్లా పరిధిలోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ కార్యక్రమం అందిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి తెలియజేశారు. ఎస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్సైట్లో అక్టోబర్ 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News October 14, 2024
కడపలో ప్రారంభమైన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ
నూతన మద్యం పాలసీకి సంబంధించి కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ శివ శంకర్, జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ సమక్షంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక్కో దుకాణానికి లాటరీ పద్ధతిలో లైసెన్స్ కేటాయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 139 మద్యం దుకాణాలకు సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది.
News October 14, 2024
అన్నమయ్య జిల్లా స్కూళ్లకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అందరూ కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సెలవు రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు అంగన్వాడీలకు వర్తిస్తుంది. కాగా కడప జిల్లాకు ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి సెలవు ప్రకటించలేదు.