India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సాధారణ ఎన్నికల షెడ్యుల్ జారీ అయిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేశ్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లోను ఎన్నికల విధులకు వాలంటీర్లను వినియోగించరాదన్నారు. ఎఫ్ఎస్‌టీ టీ్లు క్రియాశీలకంగా పని చేసే విధంగా పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈసీ సమీక్ష నిర్వహించారు.

ప్రతి సోమవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో నిర్వహించే స్పందన కార్యక్రమాలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ఆదివారం నగరపాలక సంస్థ ఎన్నికల విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో లేని సూపరింటెండెంట్ పద్మకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని మేనేజర్‌ని ఆదేశించారు. ఎన్నికల కోడ్ వచ్చినందున ఎన్నికల విధుల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, విధులు సక్రమంగా నిర్వహించాలని ఆమె చెప్పారు.

కర్నూలు: ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున “స్పందన” కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో, డివిజన్ స్థాయిలో, మున్సిపాలిటీ పరిధిలో, మండల స్థాయిలో కూడా స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించగలరని కలెక్టర్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 18వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తాన తెలిపారు. ఉదయం 7.45గంటల నుంచి మధ్యాహ్నం 12.30గటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.

జిల్లాలో ఆదివారం ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలో 24 కేంద్రాల్లో 10,526 మంది అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం జరిగిన పేపర్-1కు 63.06 శాతం (6,638), మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 62.66 శాతం (6,596) మంది హాజరైనట్లు వెల్లడించారు.

ఉరవకొండ మండలం పెద్ద ముష్టూరులో ఆదివారం దారుణం చోటుచేసుకొంది. మద్యానికి బానిసైన ఓబులేశు నిత్యం వేదిస్తున్నాడని సహనం కోల్పోయిన భార్య లలితమ్మను గొడ్డలితో తల, మేడ భాగంలో దాడి చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. క్షతగాత్రుడిని 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రతి సోమవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి శనివారం తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో ఉన్న ప్రజలు, అర్జీ దారులు గమనించాలని కోరారు.

ఇచ్ఛాపురం మండలం తులసిగాం గ్రామపంచాయతీ ఎ.బలరాంపురం గ్రామానికి చెందిన ఎ.నీలాద్రి 2024 గేట్ ఎగ్జామ్‌లో ఆల్ ఇండియాలో 343వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఒక వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చిన నీలాద్రి కఠోర సాధనతో అత్యుత్తమ ర్యాంక్ సాధించడం పై పలువురు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ స్నేహితుడు శంకర్ సహాయంతో ఈ విజయం సాధించినట్లు నీలాద్రి తెలిపారు.

చిలకలూరిపేట బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్నాడులోని ప్రముఖ క్షేత్రం కోటప్పకొండను ప్రస్తావించారు. అక్కడ ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం ఎన్డీఏ కూటమికి ఉందని ఆయన తెలియజేశారు. మోదీ హిందీలో ప్రసంగించగా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి తెలుగులోకి అనువాదం చేశారు.
Sorry, no posts matched your criteria.