India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాతోపాటు మండలాల్లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ను శనివారం విడుదల చేసిన నేపథ్యంలో జిల్లాలోనూ కోడ్ అమలులోకి వచ్చిందని, అందువల్ల స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

జిల్లాలో ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 28982 మంది ప్రైవేటు విద్యార్థులు 1592 మంది హాజరు కానున్నట్లు చెప్పారు.

నెల్లూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు పలువురు సీనియర్లు ఉండగా.. మరికొందరు తొలిసారి పోటీ చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 9వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి 5వ సారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు సిటీలో ఖలీల్ అహ్మద్, గూడూరులో మురళీ తొలిసారి పోటీ చేస్తున్నారు.

నేడు చిలకలూరిపేటకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా, గుంటూరు రేంజ్ ఐజి పాలరాజు పర్యవేక్షణలో వీవీఐపి కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ.. ప్రజాగళం సభకు 3900 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వీరిలో ఆరుగురు ఎస్పీలు, 11 మంది అడిషనల్ ఎస్పీలు, 27 మంది డిఎస్పీలు ఉన్నారన్నారు. పోలీసులకు కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా మెలగాలని సూచించారు.

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు నేపథ్యంలో కృష్ణాజిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ సీటు ఎవరికి దక్కుతుందనే సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. టీడీపీ తరఫున ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి,మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. జనసేన తరఫున మత్తి వెంకటేశ్వరరావు, మాదివాడ వెంకట కృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

చీపురుపల్లిలో నేటి నుంచి మూడు రోజులు పాటు జరగనున్న శ్రీకనక మహాలక్మి అమ్మవారు జాతర జరగనుంది. ఈ జాతరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ చక్రవర్తి తెలిపారు. స్థానిక పోలీసు అధికారులతో శనివారం చీపురుపల్లిలో పర్యటించారు. 18 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, సుమారు 8 వందల మంది పోలీసులు బందోబస్తు డ్యూటీలు వేశామన్నారు. అల్లరి మూకలపై, ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు.

ఉమ్మడి జిల్లాలో ఈసారి ఐదుగురు కొత్తవారికి వైసీపీ అవకాశం కల్పించింది. ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్ యాదవ్, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి విజయరాజు (రిటైర్డ్ రవాణా శాఖ అధికారి), పోలవరం అసెంబ్లీ అభ్యర్థి రాజ్యలక్ష్మి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ), పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గుడాల గోపికి పార్టీ అవకాశం ఇచ్చింది.

కడప జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ అధికారిగా నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్‌ను నియమించినట్టు జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కడప కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నేతలు 08562 315672 ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రు పరిధిలోగల మన్నా జూబ్లీచర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సంఘం నాయకులు డీఎస్పీ ఉమామహేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్చ్ పాస్టర్ అల్లవరం పోలీస్‌లకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పాస్టర్లు డీఎస్పీని కోరారు.

ఏలూరు జిల్లాలో ఆదివారం ఉ.10 నుంచి 12 గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సా.4 గంటల వరకు గ్రూప్-1 పరీక్షలు పకడ్బందీగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్ష కేంద్రాల పరిధిలో ఏవైనా సమస్యలు ఎదురైతే 100 నెంబర్‌కు కాల్ చేయాలన్నారు. 94409 04808 కు వాట్సాప్‌లో సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.
Sorry, no posts matched your criteria.