News March 17, 2024

ప.గో. జిల్లాలో YCP నుంచి ఐదుగురు కొత్తగా

image

ఉమ్మడి జిల్లాలో ఈసారి ఐదుగురు కొత్తవారికి వైసీపీ అవకాశం కల్పించింది. ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్‌ యాదవ్‌, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి విజయరాజు (రిటైర్డ్‌ రవాణా శాఖ అధికారి), పోలవరం అసెంబ్లీ అభ్యర్థి రాజ్యలక్ష్మి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ), పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గుడాల గోపికి పార్టీ అవకాశం ఇచ్చింది.

Similar News

News April 10, 2026

జనాభా గణనను పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్

image

భీమవరం మున్సిపల్ కార్యాలయంలో “భారతదేశ జనాభా గణన 2027” శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం పర్యవేక్షించారు. మే 1 నుంచి ప్రారంభమయ్యే గృహాల జాబితా నమోదు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని, ప్రతీ ఇంటి డేటాను సమగ్రంగా సేకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News April 10, 2026

వీరవాసరం జడ్పీటీసీపై అత్యాచారం కేసు నమోదు

image

వీరవాసరం జడ్పీటీసీ గూండా జయప్రకాశ్ నాయుడుపై భీమవరం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు విజయలక్ష్మి ఫిర్యాదుతో ఆయనపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, చీటింగ్, దాడి తదితర నాలుగు కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. నిందితుడిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

News April 10, 2026

భీమవరంలో నేడు అక్రిడేటెడ్ జర్నలిస్ట్‌లకు ఉచిత మెడికల్ చెకప్

image

ఏలూరు జిల్లాలోని అక్రిడేటెడ్ జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ఉచిత మెడికల్ హెల్త్ చెకప్ కార్యక్రమం నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ళ, ఆకివీడు, పాలకోడేరు జర్నలిస్టులకు ఏప్రిల్ 10వ తేదీ ఉదయం భీమవరం కలెక్టర్ ప్రాంగణంలో భీమవరం లయన్స్ క్లబ్, ఫెమినా లయన్స్ క్లబ్, ఒమిక్స్ నెక్స్ట్‌జెన్ లాబరేటరీస్ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతాయన్నారు.