India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీసీసీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూల భాస్కర్ తెలియజేశారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని, సాయంత్రం కడప అమీన్ మెమోరియల్ హాల్ లో నిర్వహించే ఇఫ్తార్ విందుకు ఆమె హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఉదయగిరి అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సమయాన్ని ప్రభుత్వం మార్పు చేసిందని సిడిపిఓ పచ్చవ లావణ్య సోమవారం తెలిపారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి మే 31వ తేదీ వరకు మినీ, మెయిన్ అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలన్నారు. వేసవి సెలవులు కార్యకర్తలకు మే 1 నుంచి 15వ తేదీ వరకు, ఆయాలకు మే 16 నుంచి మే 31వరకు ఉంటాయన్నారు.

విజయవాడ రైల్వే డివిజన్ 2023- 24 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రూ.4029.08 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. డివిజన్ ఏర్పడ్డ అనంతరం సరుకు రవాణాలో ఇదే అత్యధిక ఆదాయమని డివిజన్ అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. బొగ్గు, ఎరువులు, ఆహార పదార్థాలు, స్టీల్ ప్లాంట్‌కు ముడిసరుకులను డివిజన్ నుంచి ఎక్కువగా రవాణా చేశామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

ఎన్నికల నిబంధనల మేరకు ప్రజలకు సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ పంపిణీపై ఎన్నికల సంఘం కచ్చితమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. సచివాలయాలలో పెన్షన్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే సచివాలయ సిబ్బందికి లాగిన్లు ఇచ్చామన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యమని నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానాల్లో సామాన్యుడికి ఒక నిబంధన ముఖ్యమంత్రికి మరో నిబంధననా అని ఆయన ప్రశ్నించారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత రశీదు, ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వ్యాపార సంఘాలు, ట్రేడ్ యూనియన్లతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓలు పాల్గొన్నారు.

సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాతృమూర్తి తలతోటి అన్నమ్మ సోమవారం సాయంత్రం మృతి చెందారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో తూబాడు గ్రామంలోని వారి స్వగృహంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దీంతో టీజేఆర్ సుధాకర్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

శంఖవరం మండలం కత్తిపూడి శివారు ప్రాంతంలో మరమ్మతుల కోసం తీసుకువచ్చిన ఆయిల్ ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలి ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా
మృతులు కత్తిపూడికి చెందిన కొచ్చర్ల ప్రభాకర్ (38), బూరా సోమరాజు(39)గా గుర్తించారు. బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు ఉండవల్లిలోని నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానంగా ఇటీవల అలకబూనిన నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కర్రోతు బంగార్రాజు తన బృందంతో భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు ఏదైనా కార్పొరేషన్ పదవితో పాటు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఆకిరి ప్రసాద్, కడగల ఆనంద్ తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.