India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఈనెల 30న యర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు పర్యటించేలా షెడ్యూల్ ఖరారయింది. అదే రోజు లోకేశ్, బాలకృష్ణ పర్యటిస్తుండటంతో పర్యటన వాయిదా పడినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. మే 3, 4వ తేదీల్లో జిల్లాలో పర్యటిస్తున్నట్లుగా తెలిపారు. 3న మార్కాపురం, 4న దర్శిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మే 3వ తేదీన ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇటీవల ఒంగోలు కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఆయా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు చేపట్టే ప్రచారానికి రావాలని ఆహ్వానించారు.
జిల్లా ఎండ తీవ్రతతో మండిపోతోంది. ఆదివారం ఉదయం నుంచే ఎండ తీవ్రతతో పాటు వేడిగాలులతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరైంది. మార్కాపురం, కంభం, అర్దవీడులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అనేక మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా పశ్చిమ ప్రాంత మండలాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.
ఏపీ ఓపెన్ స్కూలు సొసైటీ పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారం నుంచి మే 4వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని డీఈవో సుభద్ర తెలిపారు. పరీక్షలు జూన్ 1 నుంచి 8వతేదీ వరకు జరుగుతాయన్నారు. జిల్లాలోని ఓపెన్ సొసైటీ స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్లు ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు వివరాలను తెలియజేయాలని చెప్పారు.
చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడులో భారీ మద్యం డంపును సెబ్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన గంగిరేగుల వెంకట్‌రావు గోవా నుంచి తెచ్చిన 180ML బాటిళ్లు 1001లను మరోచోటకి తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు సెబ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విలేకరులతో మాట్లాడుతూ.. అతని కాల్ డేటా ఆధారంగా మిగిలిన నిందితులను గుర్తించి కేసు నమోదు చేస్తామని చెప్పారు.
తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారిలోని సీతానాగులవరం గ్రామం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనదారుడు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంటలోపడి చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న తర్లుపాడు ఎస్సై వేముల సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదం గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
దర్శి మండలంలోని రాజంపల్లిలో ఆదివారం ఇద్దరు వ్యక్తులపై కొందరు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరు అదే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రురాలిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదివారం సాయంత్రం కందుకూరులో సీఎం జగన్ సభ జరుగుతున్న సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల అధికారులు కొరడా ఝళిపించారు. సీఎం సభ సందర్భంగా వైసీపీ అభ్యర్థి బుర్రా మధు, జగన్ ఫొటోలు ఉన్న అనేక ఫ్లెక్సీలు అనుమతి లేకుండా పట్టణంలో వెలిశాయి. దానిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది హడావుడిగా ఫ్లెక్సీలన్నింటిని తొలగించారు.
జిల్లాలో గత ఏడాది ప్రభుత్వం ద్వారా బదిలీ ఉత్తర్వులు పొంది ఇతర పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల జీతాల చెల్లింపునకు లైన్ క్లియర్ అయింది. తొమ్మిది నెలలుగా జీతాల కోసం నిరీక్షిస్తున్న వారి కల ఫలించింది. వీరి జీతాల చెల్లింపునకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 34 మంది టీచర్లకు జీతాలు నిలిచిపోయాయని డీఈవో సుభద్ర తెలిపారు.
మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లుగా మార్కాపురం పట్టణ ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ శనివారం తెలిపారు. ఈనెల 25వ తేదీన నామినేషన్ సందర్భంగా కళాశాల రోడ్డులోని ఓ టీడీపీ నేత వెంచర్ లో అనుమతి లేకుండా కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు వివిధ అంశాలపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.