India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా ఒంగోలులో గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంజాయి వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే 112కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ప్రకాశం జిల్లాలో ఆదివారం అయినా విద్యుత్ బిల్లు కౌంటర్లు తెరిచి ఉంటాయని SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లు పనిచేస్తాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించడం వలన పెనాల్టీ పడదని అన్నారు.ఆన్‌లైన్‌లో కూడా బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు.

మార్కాపురం జిల్లా పెద్దారవీడు MRO దిలీప్ కుమార్, దేవరాజుగట్టు VOR విజయభాస్కర్ రెడ్డిలను సస్పెండ్ చేసినట్లు మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ రాజబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూముల వ్యవహారంలో తహశీల్దార్ దిలీప్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని, 25కి పైగా మ్యుటేషన్‌లు నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ చేశారని వివరించారు. భూ అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం.విజయ సునీత నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి మహిళా కలెక్టర్‌గా ఆమె ఈ ఘనత సాధించనున్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాపై యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పవర్ పెట్రోల్ ధరల పెంపుతో మరో షాక్ తగిలింది. గిద్దలూరులోని అన్ని బంకుల్లో పెట్రోల్ లీటర్‌పై రూ.2.35 పెంచి రూ.119.59 చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.

మార్కాపురానికి చెందిన శ్రీరంగం నరసింహచార్యులు కుమార్తె దీప్తి ప్రతిభ చూపింది. హైదరాబాద్‌లో మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా-2026 కిరీటాన్ని దక్కించుకుంది. ఈ ఫ్యాషన్ షోలో 500 మంది పైగా పాల్గొన్నారు. దీప్తి విజేతగా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా రూ.3లక్షల ప్రైజ్ మనీ,కిరీటాన్ని అందుకున్నారు.

రంజాన్ సందర్భంగా ప్రకాశం జిల్లా ముస్లిం సోదరులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా మసీదులకు భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు.

మార్కాపురంలోని జార్జి ఫార్మసీ కళాశాలలో రేపు జాబ్ మేళా జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. B. Pharmacy, M. Pharmacy, B.Sc, M.Sc, B.Tech విద్యార్హతలు కలిగిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, పాస్ ఫోటోలు అలాగే జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఒంగోలుకు చెందిన పవన్ కుమార్ కారును గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన చిన్నగంజాం మండలంలోని కడవకుదురు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. సొపిరాలకి చెందిన కోటేశ్వరరావు, సన్నీ, వాసు మరికొంతమంది కలిసి పవన్ కుమార్ కారును ధ్వంసం చేశారు. అనంతరం చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు SI చెప్పారు.

ప్రకాశం జిల్లా పోలీస్ భద్రతా విభాగంలో 9 ఏళ్లు విశిష్ట సేవలు అందించిన జాగిలం సింధు అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. దీంతో SP హర్షవర్ధన్ రాజు విచారం వ్యక్తం చేశారు. జాగిలంపై పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.
Sorry, no posts matched your criteria.