India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు నర్సరీల నుంచి నారు, మొక్కలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో పడినంత కష్టం లేకుండా ప్రైవేట్ నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. దీని వల్ల సమయం, ఖర్చు కలిసివస్తుందని, నారు ఒకే ఎత్తులో ఉంటుందని, నాణ్యతగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 2023-24 మధ్య మిరప 95,129 ఎకరాల్లో, టమోటా 1746 ఎకరాల్లో సాగైనట్లుగా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.
ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం దోర్నాల మండలంలో పర్యటించనున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు మండలంలోని చిన్న గుడిపాడు సమీపంలో గల ఆర్డీటి కార్యాలయంలో నిర్వహించే పీఎం-జన్ మన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొననున్నట్లు తెలిపారు.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో సీఎంను ఆ శాఖ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఒకరోజు జీతాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. దాదాపు 10.60 కోట్ల రూపాయలను వరద బాధితుల సహాయార్థం అందించారని మంత్రి చెప్పారు. అలాగే విద్యుత్ పునరుద్ధరణలో ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారని అన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం మన్నేటికోటలో దారుణం జరిగింది. 9 ఏళ్ల చిన్నారిపై వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి మానవ మృగంలా అరాచకానికి పాల్పడ్డాడు. తినుబండారాల పేరుతో మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకెళ్లిన కార్తీక్ (20) అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఆ కీచకుడు పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న ఉలవపాడు పోలీసులు చిన్నారిని కందుకూరు ఆసుపత్రికి తరలించారు.
భారీ వర్షాలు, వరదలకు బాపట్ల జిల్లాలోని పెదపులివర్రు, పెనుమూడి, రుద్రవరం, రావిఅనంతారం గ్రామాల్లో కుడికరకట్ట చాలాచోట్ల బలహీనపడింది. దీంతో మంత్రులు అనగాని, గొట్టిపాటి అధికారులతో చర్చించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికుల సాయంతో 100కి పైగా ట్రాక్టర్ల మట్టిని 15వేలకుపైగా బస్తాల్లో నింపి రాత్రికి రాత్రి కరకట్టపై రక్షణ కవచంలా ఏర్పాటు చేశారు.
ముండ్లమూరు మండలం మారెళ్ళకు చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి గర్భివతిని చేసిన కేసులో నిందితుడు శ్రీరామ్ జాన్ హైడ్ (చెర్రీ)ని అరెస్ట్ చేసినట్లు దర్శి DSP లక్ష్మీనారాయణ తెలిపారు. గత నెల 20న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు కేసు నమోదుచేశారు. అప్పటినుంచి నిందితుడు తప్పించుకొని తిరుగుతుండగా సోమవారం అరెస్ట్ చేసినట్లు వివరించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సంక్షేమ సహాయకులకు నేడు బదిలీల కౌన్సెలింగ్ జరగనుంది. ఒంగోలులోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్ తెలిపారు. మొత్తం 312 మంది ఉద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
కురిచేడు మండలం గంగదొనకొండ గ్రామంలో ఈ నెల 2న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు గురైంది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామానికి చెందిన ఓ ఓ వ్యక్తి ఆదివారం అద్దంకి వెళ్లి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ఫిర్యాదుచేశారు. స్పందించిన ఆయన సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
మార్కాపురానికి చెందిన షేక్ మక్బుల్ బీ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకొని HYDకు చెందిన ఓ ఏజెంట్‌ను ఆశ్రయించింది. మస్కట్‌లోని ఓ సేట్ ఇంట్లో పని ఉందని ఏజెంట్ గత నెల 25న పంపించారు. అక్కడికెళ్లాక పనిచూపించకుండా.. ఒక గదిలో బంధించి ఒక పూటే ఆహారం ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారు. పంపించాలని కోరితే రూ.1.50లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఓ సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది.
వరద బాధితుల సహాయార్థం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు కోటి రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో శిద్దా రాఘవరావు, ఆయన సోదరులు, గోరంట్ల రవికుమార్, సుధానగుంట నరసింహారావు, వెంకట రామయ్య మరియు నిడమానూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.