India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పీసీపల్లి మండలం వాటర్ షెడ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి బుధవారం కనిగిరి MLA ముక్కు ఉగ్ర నరసింహరెడ్డితో కలిసి ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్, MLA మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు సూచించారు. మొక్కలు పెంచడం వలన ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుందన్నారు.
ఢిల్లీలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా జట్టు గెలుపులో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. శివారెడ్డి మంగళవారం తన స్వగ్రామం చేరుకున్నాడు. దీంతో అతనికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ ఊరి కుర్రాడు దేశాన్ని వరల్డ్ ఛాంపియన్‌గా నిలపడం గర్వకారణంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు
దర్శి మండలం శివరాజ్ నగర్ శివారులోని శ్రీ సాయిబాబా గుడి శ్రీ దత్తాశ్రమం పక్కనగల కొండ పైన గుర్తుతెలియని కొందరు వ్యక్తులు గుప్తనిధుల కొరకు కొండను తవ్వుతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎస్ఐ మురళి తన సిబ్బందితో దాడి చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కొండను తవ్వుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మురళి తెలిపారు.
ఒంగోలు కార్పొరేషన్ రాజకీయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది. దీంతో వైసీపీలో ఉండే కార్పొరేటర్లు ఎంత మంది అనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కార్పొరేటర్లలో అత్యధికులు బాలినేనికి సన్నిహితులు కావడం గమనార్హం.
గత రెండు రోజులుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం పామూరు మండలం గోపాలపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లూరి జిల్లాకు చెందిన అశోక్ (21) అనే యువకుడు మృతి చెందాడు. జరుగుమల్లి మండలం పచ్చవకు చెందిన మాలకొండయ్య (60) పొలం చూసుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా మరో బైక్ ఢీకొనడంతో ఆయన మృతి చెందారు.
యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుపై అధిష్టానం IVR సర్వే చేపట్టింది. గూడూరి ఎరిక్షన్ బాబు పనితీరుపై మీ అభిప్రాయం తెలియజేయండి అంటూ నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు ఫోన్‌లు రావడంతో నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అధిష్టానం సర్వే నిర్వహిస్తుందని, అందులో భాగంగానే యర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్ పనితీరుపై సర్వే జరుగుతుందని ఈ పార్టీ శ్రేణులు తెలుపుతున్నాయి.
ఉపాధిహామీ పథకంలో లక్ష్యం మేరకు పనిదినాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. సోమవారం మండల స్థాయి అధికారులతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ పనుల వల్ల కూలీలు రావడం లేదంటూ ఉపాధి పనిదినాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని హెచ్చరించారు. ఫార్మ్ పాండ్స్ వంటి వ్యవసాయ అనుబంధ ఉపాధి పనులపై ఎంపీడీవోలు దృష్టి సారించాలన్నారు.
జాతీయ నూలిపురుగుల నిర్మూలన కార్యక్రమ పోస్టర్స్‌ను సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 10 తేదీన జరిగే జాతీయ నూలిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో అల్బెండజోల్ 400 మి.గ్రా. మాత్రలు అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలలో ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.1-5 ఏళ్ళ పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలో, 6-19 ఏళ్ళ పిల్లలకు పాఠశాలలు, కళాశాలలోను పంపిణీ చేస్తారన్నారు.
మద్దిపాడు మండలం వెల్లంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గోపబోయిన రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. పిల్లలపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి డీఈవో కిరణ్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ హేమలతతో కలిసి మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
1970 ఫిబ్రవరి 2న నెల్లూరు, KNL, GNT జిల్లాల్లోని కొంత భాగాలతో ప్రకాశం జిల్లా ఆవిర్భవించింది. 1972లో టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం నామకరణం చేయబడింది. ప్రకాశం జిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. మార్కాపురం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. మన జిల్లాలో మీకు నచ్చేది ఏంటో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.