Prakasam

News September 2, 2024

మార్కాపురం మండలంలో పెద్దపులి సంచారం?

image

మార్కాపురం మండలం గొట్టిపడియ పంచాయతీలోని అక్కచెరువు తాండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం.! ఆదివారం గేదెను మేత కోసం అటవీ ప్రాంతంలో పశువుల కాపరులు వదిలారు. అయితే రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఉదయం అడవిలో వారు గాలించారు. పెద్ద పులి దాడి చేసి చంపి తిన్నట్లుగా గుర్తించి, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 2, 2024

ప్రకాశం: ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జాబ్ మేళాలు

image

నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నెలలో ఒక మెగా, రెండు మినీ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి టి. భరద్వాజ్ తెలిపారు. గత ఏడాది 20 జాబ్ మేళాలు జిల్లాలో నిర్వహించగా 2500 మంది హాజరయ్యారని తెలిపారు. వారిలో 1000 మంది ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 2, 2024

ఉలవపాడు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

ఉలవపాడు మండలంలోని కరేడు ర్యాంపు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియరాలేదు. SI కె. అంకమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

News September 2, 2024

ఒంగోలు: ‘ఆ బాధ్యత ఎంఈఓలదే’

image

ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్‌కు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, సోమవారం సెలవులు ప్రకటించిన దృష్ట్యా పాఠశాలలు తెరవకుండా చూసే బాధ్యత ఎంఈఓలదేనని డీఈఓ సుభద్ర తెలిపారు. ఈ మేరకు ఆదివారం అన్ని మండలాల ఎంఈఓలకు ఆమె వాయిస్ మెసేజ్ సందేశాన్ని పంపారు. జిల్లాలోని పాఠశాలల మూసివేతకు సంబంధించిన సమాచారాన్ని నేడు గూగుల్ షీట్‌లో ఎంఈఓలు పంపాలని డీఈఓ సూచించారు.

News September 1, 2024

ప్రకాశం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*ప్రకాశం: రేపు విద్యా సంస్థలకు సెలవు
*ప్రకాశం జిల్లాలో ముగ్గురు చిన్నారులు మృతి
*కంభంలో సముద్రం కప్పలు ప్రత్యక్షం
*దోర్నాల: ఘాట్ రోడ్‌లో విరిగిపడ్డ కొండ చరియలు
*రేపు కలెక్టర్ మీకోసం కార్యక్రమం రద్దు
*యూరప్ నుంచి ప్రకాశం జిల్లాకు చేరిన మృతదేహం
*‘కనిగిరిలో బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకలు’
*దర్శి కమిషనర్ పనితీరుపై హర్షం
*కంభంలో బులెట్ బైక్ దొంగతనం

News September 1, 2024

పొదిలి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

పొదిలి మండలం కాటూరివారిపాలెం గ్రామం వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాటూరివారిపాలెంలోని పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 1, 2024

రేపు కలెక్టర్ మీకోసం కార్యక్రమం రద్దు

image

భారీ వర్షాల దృష్ట్యా ఈనెల రెండవ తేదీ (సోమవారం ) జిల్లా వ్యాప్తంగా ‘మీకోసం’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు, అర్జీలు ఇవ్వడానికి ప్రజలెవరూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆమె సూచించారు. అలాగే తూఫాన్ నేపథ్యంలో ప్రజలు వాగుల వంకల వద్ద జాగ్రత్త వహించాలన్నారు.

News September 1, 2024

దోర్నాల: ఘాట్ రోడ్‌లో విరిగిపడ్డ కొండ చరియలు

image

దోర్నాల- శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ వర్షాల కారణంగా ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో అధికారులు దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. పడిపోయిన కొండచరియలను JCB సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ప్రయాణికులు గమనించి తమకు సహకరించాలని అధికారులు కోరారు.

News September 1, 2024

ప్రకాశం: రేపు విద్యాసంస్థలకు సెలవు

image

ప్రకాశం జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు, రెసిడెన్షియల్ స్కూల్స్‌కు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 1, 2024

కళాశాలలు నిర్వహిస్తే చర్యలు తప్పవు: RIO

image

ప్రకాశం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సోమవారం అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లు RIO సైమన్ విక్టర్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల వద్దకు విద్యార్థులు వెళ్లరాదన్నారు. అలాగే ఎవరైనా కళాశాలలు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.