Prakasam

News September 1, 2024

ఒంగోలు: ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు

image

తుఫాను వల్ల ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఏవైనా అవాంతరాలు తలెత్తితే, సహాయ సహకారాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎవరైనా సహాయం కొరకు 08592-227766 ఫోన్ నంబర్‌కు సంప్రదించాలన్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, ఈ విషయాన్ని నగరపాలక సంస్థ ప్రజలు గమనించాలని కోరారు.

News September 1, 2024

గల్లంతైన చిన్నగంజాం జాలర్ల వివరాలివే.!

image

చిన్నగంజాం మండలం రుద్రమాంబరంకు చెందిన జాలర్లు సముద్రంలో <<13993503>>గల్లంతైన విషయం తెలిసిందే. <<>>వివరాల్లోకి వెళితే.. నలుగురు జాలర్లు 10 రోజుల క్రితం చెన్నై మత్స్యకారులతో సముద్రంలో వెళ్లారు. బోటు మరమ్మతులకు గురికాగా తప్పిపోయారు. ప్రస్తుతం వారు విశాఖకు 150 కి.మీ దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తప్పిపోయిన వారు కోండురి రాములు(24), బసవన్నగారి జయరాజు(23), కాటంగారి బాబురావు(35), అవల మునీయ్య (35)గా గుర్తించారు.

News September 1, 2024

గల్లంతైన చిన్నగంజాం జాలర్ల వివరాలివే.!

image

చిన్నగంజాం మండలం రుద్రమాంబరంకు చెందిన జాలర్లు సముద్రంలో గల్లంతైన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. నలుగురు జాలర్లు 10 రోజుల క్రితం చెన్నై మత్స్యకారులతో సముద్రంలో వెళ్లారు. బోటు మరమ్మతులకు గురికాగా తప్పిపోయారు. ప్రస్తుతం వారు విశాఖకు 150 కి.మీ దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తప్పిపోయిన వారు కోండురి రాములు(24), బసవన్నగారి జయరాజు(23), కాటంగారి బాబురావు(35), అవల మునీయ్య (35)గా గుర్తించారు.

News September 1, 2024

కడప: ట్రిపుల్ ఐటీల్లో 213 మందికి ప్రవేశాలు

image

వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ ప్రాంగణంలో ఆఖరి విడత కౌన్సెలింగ్ శనివారం నిర్వహించారు. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి చేపట్టిన ఈ కౌన్సెలింగ్లో 213 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. మొత్తం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఉన్న 4,400 సీట్లు భర్తీ అయ్యాయి.

News September 1, 2024

ఒంగోలు: ట్రేడింగ్ పేరుతో రూ.20 లక్షల స్వాహా

image

మోసపూరిత ఆన్‌లైన్ ట్రేడింగ్ వెబ్‌సైట్‌తో లావాదేవీలు నిర్వహించి ఓ వ్యక్తి రూ.20 లక్షలు నష్టపోయాడు. బాధితుడి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం వెలుగులోకి వచ్చింది.  ఒంగోలు భాగ్యనగర్‌కు చెందిన కె.ఓబులేసు కొందరు నమ్మించి ఎస్బీఐ-ఐఎన్జటీ అనే సైట్ ద్వారా రూ.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టించారు. తర్వాత వారు స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 1, 2024

ప్రకాశం: ఈనెల రేషన్‌తో పాటు పంచదార పంపిణీ

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సెప్టెంబరు నెలకు సంబంధించి రేషన్‌తో పాటు పంచదారను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసింది. ఆమేరకు చౌక ధరల దుకాణాలకు చేర్చడం జరిగింది. ఏఏవై కార్డులకు 1 కిలో రూ 13.50, ఇతర కార్డులకు 1/2 కేజీ రూ.17 పంపిణీ చేయనున్నారు. తూకం, నాణ్యత, పంపిణీలో లోపాలుంటే 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

News September 1, 2024

ప్రకాశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటికి రావాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. రాచర్ల మండలం జేసీ చెరువు నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానంకు వెళ్లిన భక్తులు వాగు ఉధృతిలో కొట్టుకుపోకుండా అధికారులను అప్రమత్తం చేసి రక్షించామన్నారు. పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖ సమన్వయంతో పనిచేసినందుకు కలెక్టర్ అభినందించారు.

News August 31, 2024

ఒంగోలు: ఈ పాపను గుర్తించండి

image

ఈ ఫొటోలో ఉన్న చిన్నారి తమ పాప అయితే తగిన ఆధారాలు చూపించి తీసుకెళ్లాలని ఒంగోలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రెస్ నోట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. 18 రోజుల వయసు ఉన్న ఈ పాపకు లావాణ్య అని అధికారులు నామకరణం చేశారు. ఒంగోలు రాంనగర్లోని 3వ లైన్లో ప్రస్తుతం చిన్నారిని ఉంచారు. పాపకు సంబంధించి ఎవరైనా ఉంటే అక్కడికి రావాలని అధికారులు కోరారు. లేకుంటే చిన్నారిని అనాథగా ప్రకటిస్తామని వెల్లడించారు.

News August 31, 2024

ఒంగోలులో ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై తాజా UPDATE

image

ఒంగోలులో ఎయిర్ పోర్టు నిర్మాణ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇటీవల కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒంగోలులో ఎయిర్ పోర్టు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ దశలో కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల వద్ద 723 ఎకరాల భూమిని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇది ఒంగోలు, కొత్తపట్నం తీర ప్రాంతానికి సమాన దూరం ఉండనుంది. దీంతో తీర ప్రాంత ప్రజలకు సైతం ఎయిర్ పోర్టు సేవలు దగ్గర కానున్నాయి.

News August 31, 2024

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి గొట్టిపాటి

image

రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా విద్యుత్​ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో శనివారం ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని సూచించారు. అలాగే ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా చూడాలని ఆదేశించారు.