India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రూ.37.94 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. జిల్లాలో 729 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని మొదటి వాయిదా కింద విడుదల చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.37.94 కోట్లను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టేందుకు పంచాయతీ అధికారులు ఈ నిధులను ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది.
వైసీపీ MLC పోతుల సునీత బుధవారం పార్టీ సభ్యత్వంతో పాటు MLC పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆమె టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఆమె రాజీనామాతో ఖాళీ అయిన MLC స్థానాన్ని పులివెందులకు చెందిన TDP సీనియర్ నేత బీటెక్ రవికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పులివెందుల పోటీ చేసిన బీటెక్ రవి జగన్‌పై ఓడిపోయిన విషయం తెలిసిందే.
➤ కనిగిరిలో నవ వధువు ఆత్మహత్య
➤ మాగుంటను ఎందుకు నిందితుడిగా చేర్చలేదు: సుప్రీం
➤ ముండ్లమూరులో ఆరు నెలలగా యువతిపై అత్యాచారం
➤ మార్కాపురం: కుర్చీలోనే కుప్పకూలి బ్యాంక్ మేనేజర్ మృతి
➤ చినగంజాంలో సందడి చేసిన సినీ తారలు
➤ రాచర్ల: గుండెపోటుతో విద్యార్థిని మృతి
➤ చీరాల: వైసీసీకి పోతుల సునీత రాజీనామా
➤ ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షం
➤ రాష్ట్ర స్థాయి పోటీలకు కందుకూరు విద్యార్థి ఎంపిక
బాపట్ల జిల్లా చిన్నగంజాం మండల పరిధిలోని మోటుపల్లి గ్రామంలో బుధవారం సినీ తారల సందడి నెలకొంది. మైత్రి మూవీస్ బ్యానర్‌పై గోపీచంద్ డైరెక్షన్‌లో హిందీ సినిమా షూటింగ్ మోటుపల్లిలో జరుగుతుంది. ఈ సినిమాలో హీరోగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. కాగా సినీ తారలను చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చిన్నగంజాం ఎస్సై రమేశ్ షూటింగ్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు.
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ళకు చెందిన మైనర్ బాలికను, అదే పంచాయతీ పరిధిలోని గంగన్నపాలెంకి చెందిన శ్రీరామ్ 6 నెలలుగా అత్యాచారం చేస్తూ చివరికి గర్భవతిని చేసినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మంగళవారం సాయంత్రం పోక్సో కేసు నమోదయినట్లు SI నాగరాజు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించామని SI అన్నారు.

YS జగన్ పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రకటనలో తెలిపారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగాపడిపోయిందన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని ఆరోపించారు. డిస్కంల అప్పులు పేరు చెప్పి కరెంటు బిల్లులు పెంచి, జగన్ ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు.
YS జగన్ పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పత్రికా ప్రకటన ద్వారా అన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని ఆరోపించారు. డిస్కంల అప్పులు పేరు చెప్పి కరెంటు బిల్లులు పెంచి, జగన్ ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు.
ఒంగోలు రూట్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 30 రోజులపాటు, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత అర్హులని, వయస్సు 19- 45 ఉండి రేషన్, ఆధార్ కార్డులు కలిగి ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.

Sorry, no posts matched your criteria.