Prakasam

News March 27, 2025

ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించండి: మంత్రి స్వామి

image

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ద చూపాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం కొండపి ఎంపీడీఓ సమావేశ హాల్‌లో నియోజక వర్గ పరిధిలోని సీహెచ్‌సీ, పీహెచ్‌సీల డాక్టర్లు, హెల్త్ సూపర్వైజర్స్, ఆశా వర్కర్లతో సమావేశమై ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు.

News March 27, 2025

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

ఒంగోలులోని భాగ్యనగర్‌లో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను గురువారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సందర్శించారు. ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించాలి. కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News March 27, 2025

ఒంగోలులో ఇఫ్తార్ విందు కార్యక్రమం

image

ఒంగోలులో జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘంశాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని గోపాలస్వామి కళ్యాణమండపంలో గురువారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, మంత్రి స్వామి, ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే విజయకుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

News March 27, 2025

ఒంగోలు: బాలల వనరుల కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

ప్రకాశం భవన్‌లో జిల్లా బాలల వనరుల కేంద్రాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా గురువారం ప్రారంభించారు. అనంతరం వెట్టి చాకిరి రహిత ప్రకాశం, బంగారు బాల్యం కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ మండ్రు ప్రవీణ్ కుమార్, పారా లీగల్ వాలంటీర్, బంగారు బాల్యం కమిటీ సభ్యులు ఎం.రమేశ్ బాబు పాల్గొన్నారు.

News March 27, 2025

అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం: స్వామి

image

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో అంగన్వాడీ వర్కర్లతో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని చెప్పారు. ఖాళీలను గుర్తించి పోస్టులను భర్తీ చేస్తానన్నారు.

News March 27, 2025

ప్రకాశం: ఈ 9 మండలాల ప్రజలు జాగ్రత్త..!

image

ప్రకాశం జిల్లాలోని 9 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావటంతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. చీమకుర్తిలో 40.6, దర్శిలో 41.5, దొనకొండలో 40.7, కురిచేడులో 41.3, ముండ్లమూరులో 41.5, పొదిలిలో 41, పుల్లలచెరువులో 40.9, తాళ్లూరులో 41.2, త్రిపురాంతకంలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు.

News March 27, 2025

ఒంగోలు: కంప్యూటర్ టెస్ట్ వాయిదా

image

ఒంగోలు ఏబీఎన్ హైస్కూల్, ముప్పవరంలోని పీఎస్ ఎన్‌సీసీ హైస్కూల్, చీరాల రామకృష్ణాపురంలోని ఎమ్మెస్ హైస్కూల్లో ఎయిడెడ్ పోస్టుల నియామకానికి ఈనెల 28, 29వ తేదీల్లో కంప్యూటర్ టెస్ట్ జరగాల్సి ఉంది. కొన్ని కారణాలతో టెస్ట్ వాయిదా వేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని కంప్యూటర్ టెస్ట్‌కు సంబంధించిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తదుపరి తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.

News March 27, 2025

ప్రకాశం జిల్లాలో టెన్షన్.. టెన్షన్

image

ప్రకాశం జిల్లాలో మరికాసేపట్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ పదవులకు ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి షాక్ ఇవ్వడానికి కూటమి నాయకులు ప్లాన్ చేశారని సమాచారం. త్రిపురాంతకం వైసీపీ ఎంపీపీ అభ్యర్థి ఆళ్ల ఆంజనేయరెడ్డి జైల్లో ఉన్నారు. మరి అక్కడ ఆయన గెలుస్తారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. నిన్న రాత్రి నుంచే పోలీసులు అప్రమత్తంగా ఉంటూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 

News March 27, 2025

మార్కాపురం: ఇద్దరు యువకుల మృతి

image

పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. అర్ధవీడు(M) నారాయణపల్లికి చెందిన ఆర్మీ జవాన్ ఇంద్రసేనారెడ్డి(27), మార్కాపురం(M) మిట్టమీదపల్లికి చెందిన కాశిరెడ్డి(29) నాగార్జునసాగర్‌లోని బంధువుల ఇంటికి బైకుపై వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మాచర్ల(M) కొత్తపల్లి జంక్షన్ వద్ద డీసీఎం వీరిని ఢీకొట్టింది. ఇంద్రసేనారెడ్డి అక్కడికక్కడే చనిపోగా.. కాశిరెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.

News March 27, 2025

ప్రకాశం: ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు

image

ప్రకాశం జిల్లాలో MPP, వైస్ MPP, కో ఆప్షన్ నెంబర్, ఉపసర్పంచ్ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తే, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ఎస్పీ ఒంగోలులో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆ ప్రాంతాలలో 30 యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. నిరంతరం సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.