India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారిణి అన్నం మహిత పెన్సిల్‌పై మహాత్మా గాంధీ జీవిత చరిత్రను లిఖించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా.. బాపట్ల పెరేడ్ గ్రౌండ్లో గురువారం మహాత్మా గాంధీ జీవిత చరిత్రను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో బాపట్ల పార్లమెంటు సభ్యులు తేనేటి కృష్ణ ప్రసాద్, మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల, చీరాల MLAలు నరేంద్ర, కొండయ్య పాల్గొని మహితను అభినందించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలోని కలెక్టర్ బంగ్లాలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ‘ఎట్ హోమ్ ‘కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డితోపాటు.. జిల్లా జడ్జిలు, ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, అధికారులు, వివిధ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఒంగోలు నగరంలోని TDP పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమానికి అతిథులుగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు , ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస రావు , నగర పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరావు పాల్గొన్నారు.
బల్లికురవ మండలం మల్లాయపాలెం అంగన్వాడీ కార్యకర్త జి నాగమణికి అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. వేడుకలలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్త నాగమణికి అవార్డును అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అవార్డు అందుకున్న నాగమణిని పలువురు అభినందించారు.
యావత్ భారతావనికి తెల్లదొరల నుంచి విముక్తి కలిగించిన మహా నాయకులు ఎందరో వారిలో ప్రకాశంకు చెందిన టంగుటూరి ప్రకాశం ఒకరు. ఈయన నాగులుప్పలపాడు వినోదరాయుడుపాలెంలో జన్మించారు. తెల్లదొరల పాలనలో వారి తుపాకీకి ఎదురుగా వెళ్లి కాల్చమని సవాలు చేసిన ధీరుడు ప్రకాశం. ఈయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదు సైతం దక్కింది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కూడా ప్రకాశం. అందుకే ఈ మహనీయుని బాటను నేడు స్మరించుకుందాం.
ఒంగోలులో రాజకీయం ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. మేయర్, డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి శిష్యురాలిగా పేరుగాంచిన మేయర్ గంగాడ సుజాత పార్టీ మారడంపై వైసీపీలో కొంత విస్మయం వ్యక్తమైంది. బాలినేనిపై విమర్శలు చేస్తే చాలు రివర్స్ పంచ్ ఇచ్చే మేయర్ పార్టీ మారగా.. మిగిలిన క్యాడర్‌ను కాపాడుకొనేందుకు బాలినేని ఏం చేస్తారన్న చర్చలు జోరందుకున్నాయి.
వైసీపీ నేతల తప్పుడు ప్రచారాలపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల తీరు మారలేదని అన్నారు. పేరుకు అంబేడ్కర్ విగ్రహం పెట్టి పెద్ద పెద్ద అక్షరాలతో తన పేరు రాయించుకుని తన ప్రచార పిచ్చిని చాటుకున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దగా ఉండటంతో అభిమానులు తొలగించి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దేశభక్తిని చాటేలా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బుధవారం నగరంలో 700 మీటర్ల జాతీయ జెండా రాలీని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావుతో కలసి ప్రారంభించారు.
మండలంలోని దాసరెడ్డిపాలెం గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గురువారెడ్డి తన సొంత పొలంలో విద్యుత్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కొండేపి పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు.
ఒంగోలు MLA జనార్దన్ సమక్షంలో నేడు TDPలో చేరిన వారిన వారి వివరాలివే. మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ.. డివిజన్ల వారీగా 3వ డివిజన్లో షేక్ నూర్జహాన్, 13లో కొప్పర్ల కమలమ్మ, 16లో నాగం వెంకట శేషయ్య, 24లో బేతంశెట్టి శైలజ, 34లో ఆదిపూడి గిరిజ శంకర్, 40లో తేళ్ల చంద్రశేఖర్, 42లో కండె స్వాతి, 33లో పెద్దిరెడ్డి నియంత రెడ్డి, 47లో వేమూరి భవాని, 50వ డివిజన్లో అంబటి ప్రసాద్‌లు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.