Prakasam

News August 14, 2024

వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన ఒంగోలు మేయర్

image

ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత బుధవారం ఒంగోలు MLA దామచర్ల జనార్దన్ సమక్షంలో TDPలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల TDP కండువాను కప్పి మేయర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల పలువురు కార్పొరేటర్లు సైతం టీడీపీలో చేరిన విషయం విదితమే. కాగా మేయర్ టీడీపీలో చేరిన నేపథ్యంలో వైసీపీకి భారీ షాక్ తగిలినట్లయింది.

News August 14, 2024

ఒంగోలు: బాక్సింగ్ పోటీలకు 52 మంది ఎంపిక

image

పీఎం జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థుల ప్రాంతీయ బాక్సింగ్ పోటీలు నగరంలో నేటితో ముగిశాయి. ఈ పోటీలలో 52 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు హర్యానాలో జరుగు నవోదయ విద్యాలయాల జాతీయ బాక్సింగ్ క్రీడా పోటీలలో పాల్గొంటారు. ఈ పోటీలను దిగ్విజయంగా పూర్తి చేసిన పీఈటి పాండురంగారావు అనంతశ్రీని అభినందించారు.

News August 14, 2024

కనిగిరి: ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

image

కనిగిరిలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కనిగిరిలోని మోడల్ స్కూలుకు విద్యార్థులను తీసుకెళ్లే RTC బస్సు బుధవారం మొగుళ్లూరు పల్లి వద్ద ట్రాక్టర్ అడ్డు రావడంతో బస్సు రోడ్డు మార్జిన్‌లోకి ఒరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

News August 14, 2024

కనిగిరి: శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై చిరువ్యాపారి దాడి

image

కనిగిరి మున్సిపాలిటీలో సానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న చెన్నకేశవులు పై పామూరు బస్ స్టాండ్ సెంటర్‌లో వాచ్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్న చిరు వ్యాపారి మంగళవారం దాడి చేశారు. గాయాలతో హాస్పిటల్లో చేరిన సానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులును మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ పరామర్శించారు. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News August 14, 2024

యూరప్‌లో ప్రకాశం వ్యక్తి మృతి.. సహచరుల తీరుపై అనుమానాలు

image

దోర్నాల మండలం హసనాబాద్‌కి చెందిన శివన్నారాయణ యూరప్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతని సహచరుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘రూ. 2 లక్షలు పంపితే వీడియో కాల్ ద్వారా మృతదేహాన్ని చూపిస్తాం, రూ.10 లక్షలు పంపితే ఇండియాకు తీసుకొస్తాం’ అంటూ ఫోన్లు చేశారని, తర్వాత ఫోన్లు స్విచ్చాఫ్ చేశారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.

News August 14, 2024

ఒంగోలు: బాలల హక్కుల పరిరక్షణ పోస్టర్ విడుదల

image

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ వారి ఆదేశాల మేరకు, బాల కార్మిక వ్యవస్థ నుంచి పిల్లలకు స్వేచ్చ కార్యక్రమమునకు సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్సు కమిటీ చైర్మన్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. కార్యక్రమములో జిల్లా ఉప కార్మిక కమీషనరు ఏ గాయత్రి దేవి, సార్డ్స్ ఎన్జీవో జనరల్ సెక్రెటరీ R సునీల్ కుమార్, టాస్క్ ఫోర్సు సభ్యులు పాల్గొనారు.

News August 14, 2024

ఇసుక రీచ్‌ల వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్‌ల వద్ద అవసరం మేరకు సీసీటీవీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇసుక రవాణాకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సహజ వనరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరి అధికారులపై ఉందన్నారు.

News August 13, 2024

ప్రకాశం: ‘ఫోన్ పే ద్వారా బిల్లులు చెల్లించవచ్చు’

image

విద్యుత్ బిల్లు గతం వలే ఫోన్ పే ద్వారా కూడా చెల్లించవచ్చని ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజినీర్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం వారి కార్యాలయంలో మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో APCPDCL ముందుంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు.

News August 13, 2024

సెబ్ పెండింగ్ కేసులపై సమీక్షించిన ప్రకాశం ఎస్పీ

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం సెబ్ అధికారులతో ఎస్పీ దామోదర్ పెండింగ్ కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. .. జిల్లాలో నాటుసారా తయారీ, రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా కాచే పాత నేరస్థులపై నిఘా కొనసాగించాలని, అవసరమైతే పీడీ యాక్ట్ అమలుకు ప్రతిపాదనలు అధికారులు పంపాలన్నారు.

News August 13, 2024

సెబ్ పెండింగ్ కేసులపై సమీక్షించిన ప్రకాశం ఎస్పీ

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం సెబ్ అధికారులతో ఎస్పీ దామోదర్ పెండింగ్ కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. .. జిల్లాలో నాటుసారా తయారీ, రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా కాచే పాత నేరస్తులపై నిఘా కొనసాగించాలని, అవసరమైతే పిడి యాక్ట్ అమలుకు ప్రతిపాదనలు అధికారులు పంపాలన్నారు.