Prakasam

News February 28, 2025

ప్రకాశం జిల్లాకు 123.63 కోట్లు విడుదల

image

ప్రకాశం జిల్లాలో మార్చికి సంబంధించి పింఛన్ నగదు 123.63 కోట్లు విడుదలైనట్లు డీఆర్డీఏ ఇన్‌ఛార్జ్ పీడీ చిరంజీవి తెలిపారు. ఒకటో తేదీన 100% పింఛన్ పంపిణీ చేయాలని.. ఎవరైనా మిగిలిపోతే 3వ తేదీన పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు. నగదు పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

News February 28, 2025

పామూరు: దొంగ నోట్ల కలకలం

image

పామూరు మండలంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో నగదు జమచేసేందుకు ఓ వ్యక్తి వచ్చాడు. అతని దగ్గర ఓ రూ.200 నోటు దొంగ నోటని బ్యాంకు సిబ్బంది గుర్తించారు. ఆ నోటుపై నకిలీ అని రాసి.. దానిని ఖాతాదారుడి చేత చించి వేయించారు. దొంగనోట్ల చెలామణికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

News February 28, 2025

జనసేనలోకి శిద్ధా రాఘవరావు..?

image

మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారట. అవేమీ కుదరకపోవడంతో ఇప్పుడు జనసేన గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారంట. ప్రకాశం జిల్లాలో జనసేనను బలోపేతం చేసేందుకు మాజీ మంత్రి బాలినేని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా శిద్ధాను జనసేనలోకి ఆహ్వానించారంట.

News February 28, 2025

ఒంగోలు: ‘క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిండి’

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు గురువారం తన ఛాంబర్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు పైబడిన వారికి నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఏఎన్ఎంలు క్యాన్సర్ అనుమానిత కేసులను వైద్యాధికారికి తెలపాలన్నారు.

News February 27, 2025

ప్రకాశం జిల్లాకు రానున్న పవన్ కళ్యాణ్.?

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే నెల మొదటి వారంలో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. 5, 6, 7వ తేదీల్లో ఆయన జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన యర్రగొండపాలెం, దోర్నాల మండలాల్లో పర్యటించి ఉపాధి పనులను, పంట కుంటలను పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. కాగా ఇప్పటికే అందుకు సంబందించిన ఏర్పాట్లలో డ్వామా అధికారులు నిమగ్నమయ్యారు.

News February 27, 2025

ఒంగోలు: హోంవర్క్ నెపంతో విద్యార్థికి వాత పెట్టిన టీచర్

image

ఒంగోలులోని గంటపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 20న విద్యార్థి హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఆగ్రహంతో ఊగిపోయిన సాబిదా అనే ట్యూషన్ టీచర్ అట్లకాడ కాల్చి పిరుదుల మీద విచక్షణారహితంగా వాతలు పెట్టింది. ఆ విద్యార్థికి కాల్చిన చోట పుండ్లు పడటంతో నొప్పి భరించలేక తల్లికి చెప్పడంతో టీచర్ నిర్వాకం వెలుగు చూసింది. ఇదేమిటి అని ప్రశ్నించినందుకు ఆమె భర్త చంపుతామని బెదిరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 27, 2025

ప్రకాశం: పండగ పూట నలుగురు మృతి

image

పండగ పూట వివిధ కారణాల వల్ల నలుగురు మృత్యువాత పడ్డారు. గిద్దలూరులో రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసులు మృతిచెందగా, సంతనూతలపాడు(మం) గుడిపాడుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి మద్యంలో విషం కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వడ్డెరపాలెంలో ఏడుకొండలు డాబాపై నిద్రిస్తూ నిద్రమత్తులో కింద పడి మృతి చెందాడు. మార్కాపురంలో లక్ష్మీ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సంతోషంగా గడపాల్సిన పండగ పూట పలు గ్రామాల్లో విషాదం నెలకొంది.

News February 27, 2025

దోర్నాల ఘాట్‌లో ఎస్పీ తనికీలు.!

image

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్డుపై, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. బుధవారం రాత్రి దోర్నాలలోని మల్లికార్జున్ నగర్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.

News February 27, 2025

ప్రకాశం జిల్లాలో స్వయంగా గస్తీ చేపట్టిన SP

image

త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి దేవస్థానం, శ్రీమత్ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానాల వద్ద భద్రతా ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం రాత్రి పరిశీలించారు. ఉత్సవాల సమయంలో దొంగతనాలు, అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు. అలాగే తిరునాళ్ల సందర్భంగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా వేడుకలు జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

News February 25, 2025

మహిళలకు అండగా సఖి వన్ స్టాప్ సెంటర్: ఎస్పీ

image

మహిళలకు అండగా “సఖి వన్ స్టాప్ సెంటర్” ఉంటుందని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జీజీహెచ్ ఆవరణలో ఉన్న”సఖి వన్ స్టాప్ సెంటర్”ను మంగళవారం ఎస్పీ సందర్శించారు. ఈ సెంటర్‌లోని కేంద్ర నిర్వాహణ గది, పోలీస్ సలహాదారు గది, రెసెప్షన్, తాత్కాలిక వసతి కౌన్సిలింగ్ రూమ్‌లను ఎస్పీ తనిఖీ చేశారు.