Prakasam

News August 11, 2024

సోషల్ మీడియాలో అనుచిత ప్రకటనలు చేస్తే చర్యలు: SP

image

సోషల్ మీడియా వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులలో వినియోగదారులు, రాజకీయ నాయకులు పార్టీల మీద పోస్టులు, అనుచిత ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ శనివారం హెచ్చరించారు. అనుచిత ప్రకటనలపై గ్రూప్ అడ్మిన్లలదే పూర్తి బాధ్యతని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుచిత పోస్టులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

News August 11, 2024

కొండేపి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

కొండేపి మండలంలోని పెద్ద కల్లగుంట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళను కట్టెల ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె ట్రాక్టర్ ట్రాలీ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో స్థానికులు వెంటనే కొండేపి పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.

News August 11, 2024

కొండేపి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

కొండేపి మండలంలోని పెద్ద కల్లగుంట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళను కట్టెల ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె ట్రాక్టర్ ట్రాలీ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో స్థానికులు వెంటనే కొండేపి పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.

News August 11, 2024

బల్లికురవ: వాటర్ ట్యాంక్ పైనపడి చిన్నారి మృతి

image

బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వల్లాపల్లిలో శనివారం ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్ పైనపడి చిన్నారి షేక్ ఆసియా మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శనివారం ఆసియా ఇంటి బయట కూర్చుని ఉండగా, ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ గాలికి కిందపడింది. దీంతో అక్కడే కూర్చుని ఉన్న పాపకు తీవ్ర గాయాలు కాగా.. 108లో నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

News August 11, 2024

పొదిలి హత్య కేసులో.. భార్యతో సహా ఐదుగురు అరెస్ట్

image

భర్తను హత్య చేసిన కేసులో భార్యతోపాటు మరో ఐదుగురు అరెస్ట్ చేసిన పొదిలి పోలీసులను జిల్లా ఎస్పీ దామోదర్ శనివారం ప్రత్యేకంగా అభినందించారు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే ఉద్దేశంతో ఓ మహిళ తన భర్తను ఆగస్ట్ 2న, మరో ఐదు మందితో పథకం రచించి హత్య చేసింది. కాగా ఈ కేసును పొదిలి సీఐ మల్లికార్జున, ఎస్సై కోటయ్య ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాలతో ముమ్మర దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.

News August 11, 2024

కమాండ్ కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేసిన ప్రకాశం ఎస్పీ

image

ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఎస్పీ శనివారం తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్‌లో ఉన్న డయల్ -112/100, టీవీ న్యూస్ వాచింగ్, VHF సెట్ పనితీరు, పోలీస్ వాట్సాప్, CCTV పనితీరు వివరాలను గురించి సిబ్బందిని ఆరా తీసి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎస్పీ సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రజలుకు ఎదురయ్యే వివిధ సమస్యలు, ఇబ్బందులు గురించి వెంటనే పరిష్కరించేలా చూడాలని తెలియజేశారు.

News August 10, 2024

ప్రకాశం జిల్లాలో TODAY TOP NEWS

image

*పామూరు: ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
*చీరాలలో పర్యటించిన మాజీ ఉపరాష్ట్రపతి
*ప్రకాశం జిల్లాలో పురాతన శాసనాలు
*జిల్లాలో 27మంది MPDOలు బదిలీ
*జిల్లా సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్
*గృహ నిర్మాణాల్లో పురోగతి ఉండాలి: కలెక్టర్
*మార్కాపురంలో పదిమంది గుప్త నిధుల ముఠా అరెస్టు
*అద్దంకిలో పిడుగుపాటు 8 పొట్టేలు మృతి
*పంగులూరు వద్ద రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

News August 10, 2024

ప్రకాశం జిల్లాలో TODAY TOP NEWS

image

*పామూరు: ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
*చీరాలలో పర్యటించిన మాజీ ఉపరాష్ట్రపతి
*ప్రకాశం జిల్లాలో పురాతన శాసనాలు
*జిల్లాలో 27మంది MPDOలు బదిలీ
*జిల్లా సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్
*గృహ నిర్మాణాల్లో పురోగతి ఉండాలి: కలెక్టర్
*మార్కాపురంలో పదిమంది గుప్త నిధుల ముఠా అరెస్టు
*అద్దంకిలో పిడుగుపాటు 8 పొట్టేలు మృతి
*పంగులూరు వద్ద రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

News August 10, 2024

పంగులూరు వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

పంగులూరు మండలంలోని బయట మంజులూరు సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బయట మంజులూరు గ్రామానికి చెందిన సరికొండ నాగరాజు(39) చిలకలూరిపేట వైపు నుంచి బస్సులో వచ్చి, మంజులురు దగ్గర దిగి గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో విజయవాడ వైపు నుంచి వస్తున్న ఇంద్రా బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు.

News August 10, 2024

గృహ నిర్మాణాల్లో పురోగతి ఉండాలి: ప్రకాశం కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున జరుగుతున్న గృహ నిర్మాణాల్లో పురోగతి ఉండాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు. స్థానిక ప్రకాశం భవనంలో శుక్రవారం హౌసింగ్, ఆర్ డబ్ల్యూఎస్, డీఆర్డీఏ, మెప్మా, డ్వామా, జెడ్పీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం హౌసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారులు గృహ నిర్మాణాలపై శ్రద్ధ వహించాలన్నారు.