India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దోర్నాలలోని జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సెంట్రల్ జోన్ అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీ మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన అథ్లెటిక్ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారన్నారు. సెప్టెంబరులో జరిగే సెంట్రల్ జోన్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటారన్నారు.
త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు, టాటాఏస్ వ్యాన్ ఢీకొన్నాయి. మూడు వాహనాల్లో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. టాటాఏస్ వ్యాన్ వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లి మోసపోతున్న వారి గురించి శుక్రవారం జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కొందరు దళారులు చేసేటటువంటి మోసాల వల్ల, ఇతర దేశాలకు వెళ్లిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇటీవల పలువురిని సొంత రాష్ట్రానికి చేర్చడంపై ఎంపీ మాగుంట సంతృప్తి వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తనకు గతంలో 2+2 భద్రతను పునరుద్ధరించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారం జడ్జి వరాహ లక్ష్మీనరసింహచక్రవర్తి విచారణ చేశారు. ఏకపక్షంగా భద్రతను ఉపసంహరించారని బాలినేని తరఫు న్యాయవాది వివేకానంద పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. SRC నివేదిక మేరకు ప్రభుత్వం భద్రత ఉపసంహరించుకుందన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి చెప్పారు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్లోభాగంగా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీని నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు.
గుంటూరు నుంచి గిద్దలూరు మీదుగా తిరుపతి వెళ్లే 17261/17262 ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెండు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 9-21వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనంగా రెండు జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు.
కనిగిరి పట్టణంలోని పొదిలి రోడ్డులో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాస వేడుకలు నేటి నుంచి ఈనెల 30 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ కుందూరు తిరుపతిరెడ్డి తెలిపారు. వేడుకల్లో భాగంగా నేడు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సాయంత్రం 6 గంటలకు మహిళలచే విశేష కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొనాలని కోరారు.
ఒంగోలులోని 13వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కొప్పర్ల కమలమ్మ MLA జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం కమలమ్మ మాట్లాడుతూ.. జనార్దన్ హయాంలో ఒంగోలు గతంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఇకముందు కూడా మరింత అభివృద్ధి చేస్తారని నమ్మకంతోనే చేరామన్నారు. జనార్దన్ సమక్షంలో పార్టీలో చేరటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరోవైపు మేయర్ కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందని పార్టీ సన్నిహితులు తెలిపారు.
ప్రజల ఆకాంక్షలు కనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పర్చూరు సభ్యులు ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించారు. అనంతరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసి తీరుతామన్నారు.
అద్దంకి పట్టణంలో గరటయ్యకాలనీ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి రేణంగివరం వైపు నుంచి అద్దంకి వస్తున్న RTC బస్సును, మార్టూరు నుంచి అద్దంకి వస్తున్న బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న బాలుడు మణికంఠ మృతి చెందగా తండ్రి రాఘవకి గాయాలయ్యాయి. వీరు మార్టూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Sorry, no posts matched your criteria.