Prakasam

News August 25, 2025

రియాజ్ అను నేనుకు.. బాలినేని ఎక్కడ?

image

ఒంగోలు అర్బన్ అథారిటీ ఛైర్మన్‌గా రియాజ్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి TDP ఎమ్మెల్యేలు, ఇతర జిల్లాల జనసేన MLAలు, నాయకులు హాజరయ్యారు. అయితే ఎన్నికల అనంతరం జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గైర్హాజరు కావడం విశేషం. అసలు బాలినేనికి ఆహ్వానం అందిందా లేదా అన్నదే ప్రశ్న. ఇటీవల ఒంగోలులో నిత్యాన్నదానం ప్రారంభిస్తానని ప్రకటించిన బాలినేని కార్యాచరణ ఎవరికీ అంతుచిక్కడంలేదట.

News August 25, 2025

పొగాకు కొనుగోళ్లలో సమతుల్యం పాటించాలి: కలెక్టర్

image

పొగాకు కొనుగోళ్లలో సమతుల్యం పాటించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్లపై బోర్డు రీజనల్ మేనేజర్ రామారావు, ఐటీసీ మార్కెటింగ్ మేనేజర్ రాజుదొరైలతో సోమవారం ఒంగోలులోని తన కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు. కొనుగోళ్లకు సంబంధించి పొగాకు కంపెనీలు ఇచ్చిన ముందస్తు రిక్వైర్మెంట్స్, జిల్లాలో పొగాకు ఉత్పత్తిపై కలెక్టర్ ఈ సందర్భంగా ఆరా తీశారు.

News August 25, 2025

శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని డిమాండ్

image

ప్రకాశం జిల్లా పునర్విభజన నేపథ్యంలో తెరపైకి సరికొత్త డిమాండ్ వచ్చింది. శ్రీశైలం మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని కోరుతూ సంతకాలు సేకరించారు. ‘మార్కాపురానికి దగ్గర శ్రీశైలం ఉంది. ఇక్కడి గిరిజనులకు మార్కాపురంతో అనుబంధం ఉంది. వెలిగొండ, శ్రీశైలం ప్రాజెక్టులతో భవిష్యత్తులో నీటి వివాదాలు వస్తాయి. వీటికి పరిష్కారంగా శ్రీశైలాన్ని మార్కాపురంలో కలపాలి’ అని TDP నేత కందుల రామిరెడ్డి కోరారు.

News August 25, 2025

మర్రిపూడి: గ్రామం ఒకటే.. పంచాయతీలు రెండు

image

మర్రిపూడి మండలంలో ఓ ఊరు రెండు పంచాయతీల్లో ఉంటోంది. ఈ రెండు పంచాయతీల మధ్య పొదిలి కొండపి రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డుకు తూర్పు వైపున జువ్విగుంట, పడమర వైపు రావెళ్లవారిపాలెం పంచాయతీలు ఉన్నాయి. పొదిలి వైపు వెళ్లే వాళ్లు రావెళ్లవారిపాలెంలో బస్సు ఎక్కాలి. అదే బస్సు రిటర్న్‌లో ఆ గ్రామంలో దిగాలంటే జువ్విగుంటలో దిగాలి.

News August 25, 2025

కనిగిరి: నాన్నమ్మ అండతో జిల్లా ఫస్ట్ ర్యాంక్

image

కనిగిరి మండలం పాలూరివారిపల్లికి చెందిన లావణ్య డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటింది. ఆమెది నిరుపేద కుటుంబం. లావణ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. పాలూరివారిపల్లిలోని నాయనమ్మ వద్దనే ఉంటూ కష్టపడి చదివింది. SGTలో ప్రకాశం జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించింది. పేదరికాన్ని జయించేలా ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో లావణ్యను పలువురు అభినందించారు.

News August 25, 2025

ఒంగోలులో స్పా సెంటర్‌పై దాడి ఐదుగురు అరెస్ట్

image

ఒంగోలులో స్పా సెంటర్ పేరిట అనైతిక కార్యకలాపాలు చేస్తుండగా వన్ టౌన్ పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. మంగమూరు రోడ్డులో స్పా సెంటర్ గురించి వన్ టౌన్ సీఐ నాగరాజుకు సమాచారం అందింది. సిబ్బందితో కలిసి దాడులు చేశారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 25, 2025

ప్రకాశం: వచ్చే నెలలోనే స్మార్ట్ కార్డుల పంపిణీ

image

రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులు అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాలో 6.51 లక్షల కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం పెద్ద సైజు కార్డులు ఉండగా.. QRకోడ్‌తో ATM కార్డు మాదిరిగా స్మార్ట్ రైస్ కార్డులు రూపొందించారు. మన పక్కనే ఉండే నెల్లూరు జిల్లాలో నేటి నుంచి ఈ కార్డులు పంపిణీ చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో వచ్చే నెల 15వ తేదీ నుంచి లబ్ధిదారులకు ఇస్తారు.

News August 25, 2025

గంజా అంటే.. ప్రకాశంలో చుక్కలే.!

image

ప్రకాశం జిల్లాలో గంజాయి నిర్మూలనకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. గతంలో ఒంగోలు గంజాయికి అడ్డా అనే పేరు ప్రాచుర్యంలో ఉండేది. ఏ మేరకు వాస్తవం ఉందో కానీ, ఎస్పీ దామోదర్ సారథ్యంలో గంజా మాఫియా తాట తీస్తున్నారని ఒంగోలు ప్రజల మాట. ఆకస్మిక తనిఖీలతో పోలీసులు రంగంలోకి దిగుతుండగా, గంజా బ్యాచ్ ఊహించని స్థితిలో పట్టుబడుతోంది. మత్తు వదిలిస్తున్న ప్రకాశం పోలీస్ తీరును శభాష్ అనాల్సిందే.

News August 24, 2025

ఒంగోలు రాజకీయాలు.. 2 రోజుల్లో క్లారిటీ

image

ఒంగోలు టీడీపీ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు హాజరయ్యారు. అలాగే పార్లమెంట్ కమిటీ ఏర్పాటుకై అధిష్ఠానం నియమించబడ్డ ప్రతినిధులు సైతం సమావేశంలో పాల్గొన్నారు. అయితే అధ్యక్ష పదవికి ముగ్గురు ఎమ్మెల్యేలు, మరొకరు నామినేటెడ్ పోస్ట్ గల ప్రతినిధి పోటీలో ఉన్నట్లు సమాచారం. 2 రోజుల్లో టీడీపీ అధిష్ఠానం పార్లమెంట్ కమిటీని ప్రకటించనుంది.

News August 24, 2025

సైకిల్ తొక్కితే ఒత్తిడి తగ్గుతుంది: జిల్లా SP

image

ప్రతిరోజు సైక్లింగ్ చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతోపాటు, పోలీస్ అధికారులు, సిబ్బంది సైకిల్ తొక్కి వ్యాయామ సాధన చేశారు. అనంతరం ఎస్పీ పలు సూచనలు చేశారు.