India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రకాశం జిల్లాలో ఇంటర్-1, సెకండియర్ విద్యార్థులు 55,500 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల సమయంలో కొందరు విద్యార్థులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా అది జీవితానికి ముగింపు కాదని, ఓటమి అనేది విజయానికి తొలి మెట్టని అధికారులు సూచిస్తున్నారు. <<19635802>>తల్లిదండ్రులు<<>>, ఉపాధ్యాయులు పిల్లలకు మానసికంగా అండగా నిలవాలని, అవసరమైతే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిపుణులు తెలిపారు.

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కలెక్టర్ విజయ సునీత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఫైర్ ఎక్యూప్మెంట్ స్టాల్‌ను, పాంప్లెట్లు, పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 28,500 మంది, ద్వితీయ సంవత్సరంలో 27,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

ఒంగోలు మండలం వెంగమక్కపాలెం గ్రామ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. టిప్పర్ రివర్స్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు TVS ఎక్సెల్‌పై వెళ్తున్న వృద్ధుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వృద్ధుడు లారీ చెక్రాలకింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు టంగుటూరు మండలం ఎర్రజర్ల ఎస్సీ కాలనీకి చెందిన పేరయ్యగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కలెక్టర్ విజయ సునీత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఫైర్ ఎక్యూప్మెంట్ స్టాల్‌ను, పాంప్లెట్లు, పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు బస్టాండ్ సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు టైరు పగలడంతో అదుపు తప్పి డివైడర్ మీదకు వెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదు. తరచూ ట్రావెల్ బస్సులు ప్రమాదాలకు గురవటం ఒకింత ఆందోళనకు గురి చేస్తుంది.

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు POCSO కోర్టు తీర్పు వెలువరించింది. దొనకొండ మండలానికి చెందిన వ్యక్తి 14 ఏళ్ల బాలికను మాయమాటలతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పోలీసుల దర్యాప్తుతో నేరం రుజువై శిక్ష విధించగా.. సంబంధిత అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసులను అభినందించారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. 95% సైబర్ దాడులు నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని సోమవారం తెలిపారు. అనుమానాస్పద మెయిల్స్‌లోని లింకులను క్లిక్ చేయకూడదన్నారు. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించకపోవడం మంచిదని ప్రజలకు సూచించారు.
Sorry, no posts matched your criteria.