Prakasam

News January 6, 2025

ఉపాధి పనులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: ప్రకాశం కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు సోమవారం ఒంగోలులో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. గ్రామాల్లో కూలీలకు రూ.300 వేతనం పెంచుటానికి ఏఏ ప్రణాళికలు ఉన్నాయో క్షేత్ర సహాయకులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కార్యక్రమంలో అమలుపరుస్తున్న పల్లె పండుగ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

News January 6, 2025

అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: బాపట్ల కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి సూచించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. అర్జీలు పునరావృతం అయితే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్, అధికారులు పాల్గొన్నారు

News January 6, 2025

ప్రకాశం: సంక్రాంతి ట్రైన్లు.. 8 గంటలకు బుకింగ్

image

➤ చర్లపల్లి-తిరుపతి(07077): 6వ తేదీ
➤ తిరుపతి-చర్లపల్లి(07078): 7వ తేదీ
➤ చర్లపల్లి-తిరుపతి(02764):8, 11, 15 వ తేదీ
➤ కాచిగూడ-తిరుపతి(07655): 9, 16వ తేదీ
➤ తిరుపతి-కాచిగూడ(07656): 10, 17వతేదీ
పై ట్రైన్లు చీరాల, ఒంగోలు స్టేషన్లలో ఆగుతాయి. వీటికి ఇవాళ ఉదయం 8 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది.

News January 6, 2025

ప్రకాశం: నకిలీ పెన్షన్లపై వేటుకు రంగం సిద్ధం

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్‌లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో లక్షలమంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్‌ పెన్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నేటినుంచి వాటి లెక్కను పెద్ద ఆసుపత్రుల డాక్టర్ల బృందం ఇళ్లకే వచ్చి మరీ లబ్ధిదారులను టెస్ట్ చేయనుంది.

News January 6, 2025

మార్కాపురం నుంచి విదేశీ నేరగాళ్లకు సిమ్ములు

image

దేశంలో రోజురోజుకీ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం వాసుల పేరుతో సిమ్‌లు విదేశీ సైబర్ మోసగాళ్లకు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర నిఘా సంస్థలు ఢిల్లీ నుంచి అమరావతికి సమాచారం ఇచ్చాయి. దీంతో మార్కాపురం టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. కేంద్ర నిఘా సంస్థలు కొన్ని సిమ్ములను గుర్తించగా అందులో 10 సిమ్ములు మార్కాపురం వాసుల పేరుతో ఉన్నట్లు సమాచారం.

News January 6, 2025

బీచ్ హ్యాండ్ బాల్‌లో 3వ స్థానంలో ప్రకాశం జట్టు

image

అచ్యుతాపురం మండలం పూడిమడకలో రెండు రోజులపాటు నిర్వహించిన బీచ్ హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో మూడవ స్థానంలో ప్రకాశం జట్టు నిలిచింది. రన్నర్‌గా కర్నూలు జట్టు, విజేతగా విశాఖ జట్టు నిలిచింది. విజేతలకు బహుమతులను జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్ సుందరపు సతీశ్ కుమార్ అందజేశారు. ఈ పోటీలు విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

News January 5, 2025

బీచ్ హ్యాండ్ బాల్‌లో 3వ స్థానంలో ప్రకాశం జట్టు

image

అచ్యుతాపురం మండలం పూడిమడకలో రెండు రోజులపాటు నిర్వహించిన బీచ్ హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో మూడవ స్థానంలో ప్రకాశం జట్టు నిలిచింది. రన్నర్‌గా కర్నూలు జట్టు, విజేతగా విశాఖ జట్టు నిలిచింది. విజేతలకు బహుమతులను జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్ సుందరపు సతీశ్ కుమార్ అందజేశారు. ఈ పోటీలు విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

News January 5, 2025

త్రిపురాంతకంలో రోడ్డు ప్రమాదం

image

త్రిపురాంతకం మండలంలోని గొల్లపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం  జరిగింది. ముందు వెళ్తున్న మిని లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. విజయవాడ నుంచి జగ్గయ్య పేట వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News January 5, 2025

ఒంగోలు: సోమవారం మీకోసం కార్యక్రమం రద్దు

image

ఒంగోలులోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీవ్ రంజన్ మిశ్రా వన్ మ్యాన్ కమిషన్ పర్యటన జిల్లాలో ఉన్నందున, సోమవారం పీజిఆర్ఎప్ హాలులో దళితుల నుంచి అర్జీలు సేకరించే కార్యక్రమం ఉన్న నేపథ్యంలో రద్దు చేసినట్లు తెలిపారు. దూరప్రాంతాల ప్రజలు ఎవరూ ఒంగోలు రావద్దని ఆమె కోరారు.

News January 4, 2025

పల్లె పండుగ రోడ్లను త్వరగా పూర్తి చేయండి: ప్రకాశం కలెక్టర్

image

పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. పనుల పురోగతిపై శనివారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. చేసిన పనులకు బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లిస్తున్నందున పనులను వేగవంతం చేసి బిల్లులను అప్లోడ్ చేయాలని చెప్పారు. జిల్లాకు కేటాయించిన పనులు, వాటి పురోగతిపై నియోజకవర్గాల వారీగా ఆమె ఆరా తీశారు.