Prakasam

News January 11, 2026

వెల్లంపల్లి హైవేపై ప్రమాదం..ఒకరి స్పాట్ డెడ్

image

త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రాంబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వెల్లంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News January 11, 2026

ప్రకాశం: హైవేపై ప్రమాదం.. ఒకరు దుర్మరణం

image

లారీని కారు వేగంగా ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రాచర్ల మండలం ఎడవల్లి గ్రామం వద్ద అమరావతి- అనంతపురం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గిద్దలూరు వైద్యశాలకు తరలించగా ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 10, 2026

ప్రకాశం: ‘సంప్రదాయ క్రీడలను నిర్వహించాలి’

image

కోడి పందేలు, జూదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ క్రీడలను నిర్వహించాలన్నారు. ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే 9121102266 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News January 10, 2026

ప్రకాశం: సంక్రాంతికి విద్యుత్ శాఖ సూచనలు

image

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలను ఎగరేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. గాలిపటాలను ఎగరేసే సమయంలో సమీపంలో ఉన్న కరెంటు తీగలు, ట్రాన్స్ఫార్మర్లను గమనించాలన్నారు. గాలిపటాలు విద్యుత్ తీగలకు చిక్కుకున్న సమయంలో వాటిని తీయరాదన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News January 10, 2026

ప్రకాశం జిల్లాలో 11 మందికి పదోన్నతి

image

ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న 11 మంది సీనియర్ సహాయకులకు పదోన్నతి కల్పించారు. ఆ ఉత్తర్వులను జెడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వారికి అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో జి. సుగుణశోభారాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం.శ్రీవాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం. ఇందిరను మర్రిపూడి ఎంపీపీ, డి. ఖాసీంపీరాను బేస్తవారిపేట ఎంపీపీకి కేటాయించారు.

News January 10, 2026

ప్రకాశంలో నేడు, రేపు వర్షాలు

image

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పొగమంచు అధికంగా కురుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షసూచన ఉన్నట్లు ప్రకటన వెలువడింది.

News January 10, 2026

సెంచరీ కొట్టిన మార్కాపురం యువకుడు

image

కంభం జూనియర్ కాలేజీలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. మార్కాపురం ఆటగాడు అవినాష్ 58బంతుల్లో 13ఫోర్లు, ఓ సిక్సర్‌తో 104పరుగులు సాధించాడు. ముందుగా మార్కాపురం సబ్ సెంటర్, ఒంగోలు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన మార్కాపురం జట్టు 16 ఓవర్లకు 144పరుగులు సాధించింది. 125 పరుగులకే రెవెన్యూ టీమ్ ఆలౌటైంది.