Prakasam

News March 23, 2024

మార్కాపురం: 7 మంది వాలంటీర్లు రాజీనామా

image

మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయలలో పనిచేసే 7 మంది వాలంటీర్లు శనివారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు మేరకు 2024లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కి అందచేశారు.

News March 23, 2024

ప్రకాశం: వైసీపీ MLAపై కేసు నమోదు

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారనే ఆరోపణలపై గిద్దలూరు MLA రాంబాబుపై శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. ఈ నెల 18న మార్కాపురంలో షాదీఖానా స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయనతోపాటు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ అలిబేగ్, 20వ వార్డు కౌన్సిలర్ షేక్ సలీం పాల్గొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ రాహుల్ మీనా వారిపై కేసు నమోదు చేయించారు.

News March 23, 2024

ప్రకాశం జిల్లాలో YCP ఇప్పటివరకూ గెలవని స్థానాలు

image

2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9 స్థానాలు కైవసం చేసుకుంది. కానీ వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ పార్టీ గెలవలేకపోయింది. అవే చీరాల, కొండపి, పర్చూరు స్థానాలు. అభ్యర్థుల మార్పుతో ఎలాగైనా ఈసారి గెలవాలని గట్టి పట్టుదలతో అధిష్ఠానం భావిస్తోంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఆ స్థానాల్లో జెండా ఎగురవేయాలని భావిస్తోంది.

News March 23, 2024

ప్రకాశం: ఏప్రిల్ 18 నుంచి నామినేషన్లు: ఎన్నికల అధికారి

image

ఏప్రిల్ 18 నుంచి జరిగే నామినేషన్లు జరగనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ట్రైల్ రన్ నిర్వహించారు. వచ్చే నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేక అధికారుల నియామకం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.

News March 22, 2024

ప్రకాశం: మాజీ మంత్రి శిద్దా సోదరుడు మృతి

image

రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు సోదరుడు వెంకట కృష్ణారావు మృతి చెందాడు. చీమకుర్తి మండలంలోని రామతీర్థం పుణ్య క్షేత్రంలోని ఆర్యవైశ్య సత్రం వద్ద ఉన్న బావిలో వెంకట కృష్ణారావు మృతదేహం లభ్యమైంది. అతనిది ఆత్మహత్యా, బావిలో కాలు జారిపడ్డాడా అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని సొంత గ్రామమైన చీమకుర్తికి తీసుకువచ్చారు.

News March 22, 2024

ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నా: రాయపాటి

image

ఎంపీలు సీబీఐ కేసులకు భయపడి ఏపీ హక్కుల కోసం పార్లమెంటులో పోరాటం చేయలేకపోతున్నారని విద్యార్థి సంఘాల రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీశ్ మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జేఏసీ సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలు, ఏపీకి రావాల్సిన హక్కుల కోసం ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు రాయపాటి జగదీశ్ స్పష్టం చేశారు.

News March 22, 2024

కురిచేడు: రైటు పట్టాలపై విద్యార్థిని డెడ్ బాడి

image

కురిచేడు మండలం దేకనకొండ గ్రామానికి చెందిన పి. భార్గవి (19) దర్శిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతుంది. గురువారం కాలేజికి బయలుదేరి వెళుతున్నానని చెప్పి వెళ్ళింది. మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించింది. భార్గవి తల్లిదండ్రులకు రైల్వే పోలీసులు సమాచారాన్ని అందించారు. ఇది ఆత్మహత్యనా లేక ప్రమాదమా అనే కారణాలు తెలియాల్సి ఉంది.

News March 22, 2024

ప్రకాశం: పెండింగ్‌లో రెండు సీట్లు

image

ఇవాళ టీడీపీ మూడో జాబితాలో చీరాల టికెట్‌ను కొండయ్యకు కేటాయించింది. ఇక దర్శి ఎమ్మెల్యే, ఒంగోలు ఎంపీ స్థానాలు పెండింగ్‌లో ఉంచాయి. దర్శి టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గరికపాటి వెంకట్‌కు కేటాయిస్తారని వార్తా కథనాలు వెలువడ్డాయి. ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డికి టీడీపీ నుంచి ఇస్తారని టాక్.

News March 22, 2024

చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండయ్య

image

చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండయ్యను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకటించారు. బాపట్ల జిల్లాలో చీరాల ఒక నియోజకవర్గాన్ని పెండింగ్లో పెట్టిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇవాళ విడుదల చేసిన జాబితాలో చీరాల సీటును కొండయ్యకు ఖరారు చేశారు. ఇక వైసీపీ నుంచి కరణం వెంకటేశ్ పోటీ చేయనున్నారు.

News March 22, 2024

ప్రకాశం జిల్లాకు చంద్రబాబు రాక

image

సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 31న జిల్లాకు రానున్నారు. కొండపి నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాగళం సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభకు విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు, న్యాయవాదులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నట్లు టీడీపీ నాయకులు వెల్లడించారు. అనంతరం మార్కాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు.