India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఎద్దేవ చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకముందే ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ఇసుక ధరలకు మీ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి తేడా తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకునేదే లేదని ఆగ్రహించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి బాలనేని ఓటమి తర్వాత ఇవాళ ఒంగోలుకు వస్తున్నారు. అంతే కాకుండా ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని పలు మార్లు ప్రచారంలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయంపై నియోజకవర్గం ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్ జయంతిన చాలా మంది కార్పొరేటర్లు దూరంగా ఉండటం కూడా నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
ప్రకాశం జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న కుటుంబాలలోని క్రీడా విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన 127 మంది విద్యార్థులకు ఎస్పీ ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గరుడ్ సుమిత్ మాట్లాడుతూ.. పోలీసు విధులు చాలా కష్టంతో కూడుకున్నవని, కుటుంబంతో గడపడానికి చాలా తక్కువ సమయం ఉంటుందని, కానీ.. వారి పిల్లల చదువుల కోసం మంచి గైడెన్స్ ఇస్తూ అన్ని వసతులు సమకూరుస్తున్నారని అన్నారు.
మార్టూరులో బాలుడి కిడ్నాప్‌కి యత్నం అంటూ వచ్చిన వార్తలను ఆదివారం సీఐ రాజశేఖర్‌రెడ్డి ఖండించారు. అసలు అలాంటి సంఘటనే జరగలేదన్నారు. ఆ బాలుడు బయటకు వెళ్ళి కొద్ది సేపు ఇంటికి తిరిగి రాలేదని తెలిపారు. అతడు ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించి, మందలిస్తారనే భయంతో ఆ బాలుడు కిడ్నాప్ కథ చెప్పాడన్నారు. అయితే కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలు ప్రచురించాయని సీఐ మండిపడ్డారు.
సొంత అన్ననే తమ్ముడు హత్య చేసిన దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. చినగంజాంకు చెందిన హెడ్‌కానిస్టేబుల్ కంపిరి సురేశ్‌కు ఇద్దరు కూమారులు. పెద్దవాడు అనిల్ గంజాయికి బానిసై డబ్బు ఇవ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరించేవాడు. అన్న తల్లిదండ్రులను చంపేస్తాడని భావించిన తమ్ముడు అఖిల్ స్నేహితులతో కలిసి ఈనెల 5న పెనుగంజిప్రోలు వద్ద అన్నకు మద్యం తాగించి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు.
ఏపీలో భారీగా ఎస్పీలు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గరుడ్ సుమిత్ సునీల్‌ను బదిలీ చేస్తూ శనివారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను DGP ఆఫీసులో రిపోర్టింగ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సునీల్ స్థానంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా దామోదర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని డీఈవో డి.సుభద్ర శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా చేపట్టిన ఏక్ పేడ్ మాకౌనామ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులతో మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జియోటాగ్ ఫొటోలను గ్రూపులో పెట్టాలన్నారు.
స్కాలర్షిప్ కోసం 2023 డిసెంబర్ 3న జరిగిన పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారి జాబితా ప్రకాశం వెబ్సైట్ లో ఉంచినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. ఎంపికైన విద్యార్థులు వెబ్సైట్ నుంచి వారి మెరిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని వారి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి పేరును సరిచూసుకోవాలన్నారు. వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే NMMS అధికారిక పోర్టల్‌లో ఆగస్టు 31 లోగా అప్లోడ్ చేయాలన్నారు.
అమాయక విద్యార్థులు, యువకులకు గంజాయి విక్రయించే వారికి జైలు శిక్ష తప్పదని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ హెచ్చరించారు. ఒంగోలులో SP మాట్లాడుతూ.. జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం ద్వారా 25 మందిని అరెస్టు చేసి వారి నుంచి 8.91 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 14500కు తెలియజేయాలని కోరారు. SHAREit
అదుపుతప్పి అంబులెన్స్ కాలువలోకి దూసుకెళ్లి నీటిలో మునిగిన ఘటన సింగరాయకొండ మండల పరిధిలోని పెరల్ డిస్టిలరీ సమీపంలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ పేషెంట్‌ను తీసుకొచ్చి తిరిగి వెళ్తోంది. పెరల్ డిస్టిలరీ సమీపంలోకి రాగానే అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు.
Sorry, no posts matched your criteria.