India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బల్లికురవ మండలంలోని కొప్పరపాలెంలో రెండు రోజుల నుంచి భార్యాభర్తల మధ్య వివాదం నడుస్తోంది. ఈక్రమంలో వారి కుటుంబ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడికి యత్నించారు. భార్య బంధువులు మంగళవారం ఉదయం భర్త ఇంటిపై దాడి చేశారు. భర్తతో పాటు మరో వ్యక్తిపై దాడి చేసి బీరువాలో ఉన్ననగదును ఎత్తుకెళ్లినట్లుగా చెప్పాడు. భయభ్రాంతులకు గురైన వారు బల్లికురవ పోలీసులను ఆశ్రయించగా, ఘటనపై విచారణ చేపట్టారు.
విద్యా సంవత్సరం మొదలైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు, పాఠ్య పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యాశాఖ అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్షించారు. అకడమిక్, విద్యాలయాలలో చేపడుతున్న నిర్మాణాలు, ఎడ్యుకేషన్ కార్యకలాపాలతో పాటు వివిధ యాజమాన్యాల క్రింద ఉన్న పాఠశాలల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో దద్దనాల ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడికి ఎంతోమంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయానికి మంగళ, శనివారం మాత్రమే ప్రజలను అనుమతిస్తామని కొలుకుల సెక్షన్ ఫారెస్ట్ అధికారి వెల్లడించారు. ఈ మేరకు శాంతినగర్ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బైకుకు రూ.50, నాలుగు చక్రాల వాహనాలకు రూ.100 వసూళ్లు చేస్తామని తెలిపారు.
మూడో కొత్త రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా విజయవాడ డివిజన్ పరిధిలోని ఒంగోలు మీదగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. (07500)విజయవాడ-గూడూరు, (12743/44)విజయవాడ-గూడూరు వెళ్లే ఈ రైళ్లను 15 నుంచి 30 వరకు, (07576) ఒంగోలు-విజయవాడ, (07461) విజయవాడ-ఒంగోలు వెళ్లే రైళ్లను 16 నుంచి 30 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి హైదరాబాద్‌లో సోమవారం ఆపరేషన్ చేశారు. చిన్నపాటి సమస్య ఉండటంతో ఆయన తన కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ మంగళవారం ఆసుపత్రికి వెళ్లి నారాయణ రెడ్డిని పరామర్శించారు. త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని ఆకాంక్షించారు.
మార్కాపురానికి చెందిన అరిమెల్ల అశోక్(26) 2022లో తల్లిని హత్య చేశాడు. దీంతో అతణ్ని ఒంగోలు జైలుకు తరలించారు. బెయిల్ మీద బయటికి వచ్చి తర్వాత ఆయన పెదనాన్నను చంపాడు. మళ్లీ అతడిని జైలుకు పంపారు. కొద్ది రోజుల తర్వాత మానసిక స్థితి బాగోలేదు. వైద్యం కోసం విశాఖ మెంటల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తనకు బెయిల్ రాదేమోనని భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒంగోలుకు చెందిన రాజేశ్ బాబు అస్సాంలో హత్యకు గురయ్యాడు. అస్సాంలో రాజేశ్ ప్రిన్సిపల్‌గా, కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేసేవాడు. అక్కడ ఓ విద్యార్థికి తక్కువ మార్కులు రావడం, ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆయన శనివారం మందలించాడు. తల్లిదండ్రులను తీసుకురావాలని ఆదేశించాడు. దీంతో ఆ విద్యార్థి కక్ష పెంచుకొని సాయంత్రం రాజేశ్ క్లాస్ చెబుతుండగా.. కత్తితో దాడి చేసి చంపేశాడు. పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పేర్కొన్నారు. మహిళకు అర్ధరాత్రి ఫోన్ చేసి వేధింపులు అనే కథనం “way2news”లో ఆదివారం రావడంతో ఎస్పీ సోమవారం స్పందించారు. లైంగిక వేధింపు నిరోధక చట్టాన్ని పక్కగా అమలు చేస్తున్నామని, అంతర్గత ఫిర్యాదుల మేరకు విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
చీరాల కొత్తపాలేనికి చెందిన మణికంఠరెడ్డి, కుసుమాంజలికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మొదటి సంతానంగా పాప పుట్టగా, కుసుమాంజలి గర్భవతిగా ఉన్న సమయంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడు. కుసుమాంజలికి రెండో కాన్పులో ఆడ కవలలకు జన్మనిచ్చింది. దీంతో అత్తా, మామ, మరిది ఇంట్లోకి రానివ్వలేదని అత్తింటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. కుసుమ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లాలోని మూడు ప్రదేశాలలో సుమారు 42,833 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్లు గనులు, భూగర్భ శాఖ జిల్లా అధికారి బి.జగన్నాథరావు తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం టన్ను ఇసుక ధర రూ.247గా కలెక్టర్ ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్, సతుకుపాడు డంప్-1, డంప్-2లో రూ.247 చెల్లించి సొంత వాహనాలలో ఇసుక తీసుకెళ్లవచ్చని తెలిపారు.
Sorry, no posts matched your criteria.