Prakasam

News July 6, 2024

హైకోర్టు ప్రభుత్వ సహాయ ప్లీడర్లుగా ప్రకాశం జిల్లా వాసులు

image

ఏపీ హైకోర్టులో ప్రభుత్వ సహాయ ప్లీడర్లుగా (AGP) ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ అబ్దుల్ రషీద్ అహమ్మద్, కొల్లూరి అర్జున్ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం 3వ తేదీ జీవో జారీ చేయగా వారు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వారు.. చిన్న వయసులోనే AGPగా హైకోర్టుకు ఎంపిక కావడంపై జిల్లా వాసులు, తోటి న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

News July 6, 2024

సింగరాయకొండలో యువకుడు దారుణ హత్య

image

సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పోలేరమ్మ దేవస్థానం ఎదురుగా ఓయువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. బాపట్ల జిల్లాకు చెందిన గోపి (35), లక్ష్మీ అనే మహిళతో సహజీవనం సాగిస్తున్నారు. ఇటీవల లక్ష్మీ వేరే వ్యక్తితో చనువుగా ఉండడంతో గొడవలు జరుగుతున్నాయి. అక్రమసంబంధాల కారణంగా గోపి హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

News July 6, 2024

ఒంగోలు: యువకుడిపై విచక్షణారహితంగా కర్రలతో దాడి

image

ఒంగోలులో ఓ యువకుడిపై పలువురు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేసి, గొంతుకు తాడు బిగించి హత్యయత్నానికి పాల్పడ్డారు. గ్యాస్ డెలివరీ బాయ్ డేనియల్ సన్నిహితంగా ఉంటున్న యువతి ఇంటికి బుధవారం రాత్రి మద్యం తాగి వెళ్లాడు. అక్కడ యువతి సంబంధీకులు ఆ యువకుడిని కొట్టినట్లు తెలుస్తోంది. యువతి ఇంటిముందు అతడు గాయాలతో ఉండటాన్ని గమనించిన స్థానికులు డానియల్ తల్లికి సమాచారం అందించి ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

News July 6, 2024

ప్రకాశం: భార్య బైక్ అడగలేదని భర్త ఆత్మహత్య

image

గుడికి వెళ్లేందుకు ఇతరులను బైక్ అడిగేందుకు భార్య నిరాకరించిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముండ్లమూరు మండలం నాయుడుపాలేంలో జరిగింది. బద్రి శ్రీకాంత్(34) భార్యతో కలిసి శింగనకొండ ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భర్త భార్యను గుడికి వెళ్లడానికి ఎవరినైనా బైక్ అడగమని అడగ్గా.. భార్య నిరాకరించి బస్సులో వెళ్దామంది. దీంతో మనస్తాపానికి గురై విష రసాయనం తాగి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News July 6, 2024

ముండ్లమూరు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

మండలంలోని నాయుడుపాలెం గ్రామానికి చెందిన బద్రి శ్రీకాంత్ రెడ్డి ఎలుకల మందు తిని మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం పోలవరం సమీపంలో రేకుల షెడ్డులో ఎలుకలో మందు తిని అపస్మారస్థితిలో వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 6, 2024

కనిగిరి: భార్యపై కోపంతో కూతురిపై అత్యాచారం

image

భార్యపై కోపంతో కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా, టీపీ గూడూరులో జరిగింది. నెల్లూరు ఇన్ ఛార్జ్ డీఎస్పీ డి. శ్రీనివాస రెడ్డి వివరాల మేరకు టీపీ గూడూరుకు చెందిన మహిళ కనిగిరికి చెందిన కె.మల్లిఖార్జునను రెండో పెళ్లి చేసుకుంది. వీరి మధ్య విబేధాలు రావడంతో గతనెల 29న తన భార్య కుమార్తెను బట్టలు కొనిస్తానని చెప్పి బాలికను బైక్‌పై అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

News July 6, 2024

తాళ్లూరు : టీడీపీ ఫ్లెక్సీ చించివేతపై కేసు నమోదు

image

మండలంలోని వెలగలవారిపాలెంలో ఇటీవల టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చించివేసిన ఘటనపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెలుగు లక్ష్మయ్య వర్గీయులు బొద్దికూరపాడు రహదారివైపు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఇద్దరు వ్యక్తులు దాన్ని చింపేయగా లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.

News July 6, 2024

గుంటూరు రేంజ్ ఐజీని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

image

గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో శుక్రవారం ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి (IPS)ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువతో సత్కరించారు. లా అండ్ ఆర్డర్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వీళ్లతో పాటు ఒంగోలు పార్లమెంట్ జనసేన అధ్యక్షుడు రియాజ్ ఉన్నారు.

News July 6, 2024

తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి నిలపాలి: కలెక్టర్ అన్సారియా

image

తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక దృష్టి నిలపాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శుక్రవారం ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్‌లో ఒంగోలు కార్పొరేషన్‌తో సహా అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలలో ఇళ్లకు సరఫరా చేస్తున్న తాగునీటి సరఫరా వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News July 5, 2024

ప్రకాశం: ఓకే మండలంలో ముగ్గురు ఆత్మహత్య

image

ముండ్లమూరు మండలంలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. పసుపుగల్లు, బొప్పిడి వారి పాలెం, నాయుడుపాలెంలలో ముగ్గురు వేరు వేరు కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మూడు మృతదేహాలు వేర్వేరు చోట్ల లభ్యం కావడంతో ముండ్లమూరు మండలంలో కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.