Prakasam

News December 16, 2024

ప్రకాశం జిల్లా జూనియర్ బాలికల కబడ్డీ జట్టు ఎంపిక

image

ప్రకాశం జిల్లా జూనియర్ బాలికల కబడ్డీ జట్టును పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ అదివారం తెలిపారు. ఈ జట్టు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఈ నెల 22 నుంచి 25 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు హాజరత్తయ్య సిబ్బంది పాల్గొన్నారు.

News December 14, 2024

ఒంగోలు: ‘రహదారి భద్రత నిబంధనలు పాటించాలి’

image

ఒంగోలు ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఆటో డ్రైవర్లు కాలేజీ బస్సుల యజమానులకు రహదారి భద్రతా నియమ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఉప రవాణా కమిషనర్ సుశీల మాట్లాడుతూ.. ఆటోలలో స్కూలు పిల్లలను తరలించవద్దని అధిక లోడుతో ప్రయాణికులను ఎక్కించకూడదన్నారు. సరియైన రికార్డులను కలిగి ఉండాలని సూచించారు. రహదారి భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలని లేనట్లయితే కేసులు నమోదు చేస్తామన్నారు.

News December 13, 2024

ప్రకాశం జిల్లాకు రూ.12 కోట్లు విడుదల

image

ప్రకాశం జిల్లా పడమటి ప్రాంత ప్రజలకు నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ ఎన్నో ఏళ్లనాటి కల. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఈ పేరు వింటూనే ఉన్నా పనులు పూర్తి కాలేదు. తాజాగా ఈ ప్రాజెక్టు సంబంధించి సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. జిల్లా పరిధిలో ఈ రైల్వే లైన్ భూసేకరణకు పెండింగ్‌లో ఉన్న రూ.12 కోట్లు ఇవాళే(శుక్రవారం) విడుదల చేయాలని నిన్నటి సమావేశంలో ఆదేశించారు. దీంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 12, 2024

కంభం: వీరుడికి కన్నీటితో సెల్యూట్

image

జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన సుబ్బయ్య (45)కు నార్పలలో అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. పోలీసులు, బంధువులు, ప్రజల అశ్రునయనాల మధ్య వారి సొంత వ్యవసాయ పొలంలో సైనిక లాంచనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సైనిక అధికారులు గౌరవ వందనం సమర్పించి జాతీయ జెండాను జవాన్ సతీమణికి అందించారు. కన్నీటిని దిగమింగుతూ సుబ్బయ్య భార్య, కుమారుడు, కుమార్తె భౌతికకాయానికి సెల్యూట్ చేశారు.

News December 12, 2024

సింగరాయకొండ: 800 మందిని మోసం చేసిన కి‘లేడీ’

image

మండలంలోని ఉలవపాడుకు చెందిన కామంచి కోటి అనే వ్యక్తి నందిని పొదుపు సంస్థను ప్రారంభించారు. ఈ పొదుపు సంఘాల్లో సింగరాయకొండకు చెందిన పలువురిని చేర్చుకొని 800 మంది చేత రూ.50 లక్షల వరకు కట్టించాడు. కోటి మరణించగా.. అతని భార్య నందిని పొదుపు సంస్థను నడుపుతూ వచ్చింది. గత కొన్ని నెలలుగా సంస్థను మూసివేయడంతో డబ్బులు కట్టిన వారు మోసపోయామని గ్రహించి న్యాయం కోసం సింగరాయకొండ ఎస్సై మహేంద్ర వద్దకు చేరారు.

News December 12, 2024

ప్రకాశం: విదేశాలకు వెళ్లి.. కష్టాలను తీరుస్తాడనుకుంటే!

image

‘మా వాడు బాగా చదివాడు.. విదేశాల్లో గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు’ అని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇంటికి వచ్చి తమను సంతోషంగా చూస్తాడనుకొని ఆనందపడ్డారు. కానీ.. ఓ <<14850503>>రోడ్డు ప్రమాదం<<>> వారి ఆశలను రోడ్డు పాలు చేసింది. ఈ ఘటన చీమకుర్తి బూదవాడలో చోటు చేసుకుంది. బుధవారం చిరంజీవి(32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అతడితో ప్రయాణించిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ కుటుంబాన్ని శోకసంద్రాన్ని మిగిల్చింది.

News December 12, 2024

రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్: వైయస్ జగన్

image

జమ్మూలో విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్‌ వరికుంట్ల సుబ్బయ్య రియల్ హీరో అని మాజీ సీఎం జగన్ కొనియాడారు. సుబ్బయ్య ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి త‌న‌తోటి జవాన్‌లు 30 మందిని కాపాడడం స్ఫూర్తిదాయకమని అన్నారు. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ‘X’లో పోస్టు చేశారు.

News December 11, 2024

రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్: వైయస్ జగన్

image

జమ్మూలో విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్‌ వరికుంట్ల సుబ్బయ్య రియల్ హీరో అని మాజీ సీఎం జగన్ కొనియాడారు. సుబ్బయ్య ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి త‌న‌తోటి జవాన్‌లు 30 మందిని కాపాడడం స్ఫూర్తిదాయకమని అన్నారు. తన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, తన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ‘X’లో పోస్టు చేశారు.

News December 11, 2024

లండన్‌లో బూదవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

image

లండన్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చీమకుర్తి మండలం బూదవాడకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పీ చిరంజీవి(32) మృతిచెందారు. అతను కారులో వెళుతుండగా డివైడర్‌ను ఢీకొట్టడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలియడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతదేహం ఇండియాకు రావాల్సి ఉంది.

News December 11, 2024

జవాన్ మృతిపై స్పందించిన మంత్రి అనిత

image

జమ్మూలో ల్యాండ్ మైన్ పేలి వీరమరణం పొందిన కంభం మండలం <<14838717>>రావిపాడుకు చెందిన జవాన్ <<>>వరికుంట్ల సుబ్బయ్యకు బుధవారం మంత్రి అనిత సంతాపం తెలిపారు. సైన్యంలో 23 ఏళ్లు సేవలందించిన సుబ్బయ్య ప్రాణాలు కోల్పోయిన వార్త కలచివేసిందన్నారు. కానీ, మృత్యువు చేరువైందని తెలిసినా గో బ్యాక్ అంటూ సహచర జవాన్లను అప్రమత్తం చేసి తనువు చాలించారని, జవాన్ సుబ్బయ్య సాహసం ఆదర్శమని మంత్రి అనిత తన X ఖాతాలో పోస్ట్ చేశారు.