Srikakulam

News November 4, 2024

శ్రీకాకుళం: ప్రజా ఫిర్యాదుల వేదికకు 204 ఫిర్యాదులు

image

మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీలు పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) మీకోసం కార్యక్రమంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 204 అర్జీలను స్వీకరించామన్నారు.

News November 4, 2024

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళా

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం కళాశాల JKC, అంజనా ఫౌండేషన్ వారు సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోవిందమ్మ తెలిపారు. ఫాక్సకాన్ యాపిల్ సెల్ కంపెనీ, స్క్నీడర్ ఎలక్ట్రికల్ కంపెనీ, ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ కంపెనీ, టాటా ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలకు ఇంటర్వూలు జరుగుతాయన్నారు. 25 ఏళ్లు లోపు వయస్సు ఉండి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని తెలిపారు.

News November 4, 2024

టెక్కలి: దేశంలోనే అతిపెద్ద శివలింగం

image

శివలింగాలలో అతి పెద్దది జిల్లాలోని టెక్కలి మండలం రావివలస గ్రామంలో ఉంది. దేశంలోనే పెద్దదైన ఈ శివలింగం మన రాష్ట్రంలో ఉండడం విశేషం. రావివలస గ్రామంలో వెలిసిన శ్రీ ఎండల మల్లికార్జునస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదిగా మారింది. దాని ఎత్తు 55 అడుగులు, అందువల్ల ఈ ఎండల మల్లన్నకు గోపురం ఉండదు. నిరంతరం మల్లన్న ఎండలోనే ఉంటాడు కాబట్టి ఆ శివలింగానికి ఎండల మల్లికార్జునస్వామి అనే పేరు ప్రసిద్ధి చెందింది. 

News November 4, 2024

రావివలస: రామాయణ చిత్రానికి అవార్డు

image

రావివలస ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు నారాయణ మూర్తి గీసిన చిత్రాన్ని అవార్డు వరించింది. హైదరాబాద్ కాసుల చిత్రకళా అకాడమీ ఇటీవల ఆన్‌లైన్లో నిర్వహించిన రామాయణం ఇతివృత్త చిత్ర పోటీల్లో ఈ చిత్రం ద్వితీయ స్థానంలో నిలిచింది. మొత్తం 2,275 మంది పోటీలో పాల్గొనగా.. ఈ చిత్రం ద్వితీయ స్థానం పొందినట్లు అకాడమీ నిర్వాహకులు నారాయణ మూర్తికి ప్రశంసాపత్రం, అభినందనలేఖ పంపినట్లు ఆయన తెలిపారు.

News November 3, 2024

SKLM: ఇరిగేషన్.. ఇండస్ట్రీ.. ఇదే మా నినాదం: మంత్రి

image

వలసలను నివారించడమే ధ్యేయంగా శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్ పోర్టు, మూలపేట పోర్టులను అనుసంధానిస్తూ కోస్టల్ కారిడార్ నిర్మాణానికి డిపిఆర్‌లు రూపొందిస్తున్నామని అన్నారు. జిల్లా అభివృద్ధిపై గతంలో ఏ సీఎం కూడా జిల్లా అధికారులతో రివ్యూ చేసింది లేదన్నారు.

News November 3, 2024

శ్రీకాకుళం: డిసెంబర్ 7న రన్ ఫర్ జవాన్

image

దేశం కోసం, ప్రజల ప్రాణ రక్షణ కోసం తమ ప్రాణాలకు సైతం తెగించి, దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న వీరులు సైనికులని మంత్రి అచ్చెన్న, రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జవాన్ కుటుంబాలకు అండగా నిలిచేలా డిసెంబర్ 7న ఆర్మీ ఫ్లాగ్ డే సందర్భంగా SKLM నగరంలో రన్ ఫర్ జవాన్ – 5కే రన్ పేరిట విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

News November 2, 2024

SKLM: రూ.1.50 లక్షల చెక్కు అందించిన కలెక్టర్

image

క్యాన్సర్‌తో బాధ పడుతున్న తన తల్లికి మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన 24 గంటల్లోనే బాధిత కుటుంబానికి రూ.1.50 లక్షల చెక్కును కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం అందజేశారు. జలుమూరు మండలం కరకవలస గ్రామానికి చెందిన పేరాడ సాయిరాం తన తల్లి అమ్మన్నకు క్యాన్సర్ సోకిందని, ఎంత ఖర్చు చేసినా మెరుగైన వైద్యం అందించలేక పోతున్నామని ముఖ్యమంత్రి ఎదుట వాపోయాడు.

News November 2, 2024

REWIND: ఎర్రన్నాయుడు మృతి చెంది నేటికి 12 ఏళ్లు

image

కింజరాపు ఎర్రన్నాయుడు మృతి చెంది నేటికి సరిగ్గా 12 ఏళ్లు అయింది. అది 2012 NOV 1వ తేదీ అర్ధరాత్రి 1 గంట పలు కార్యక్రమాలకు హాజరై శ్రీకాకుళం తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 2 గంటల సమయంలో రణస్థలానికి సమీపంలోని యూటర్న్‌ తీసుకుంటున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. శ్రీకాకుళం కిమ్స్‌కి తరలించారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ లేకపోవడంతో పరిస్థితి విషమించి 2న కన్నుమూశారు.

News November 2, 2024

వీరఘట్టం: ట్రైన్ కిందపడి యువకుడి ఆత్మహత్య

image

ప్రేమ విఫలమైందని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. వీరఘట్టం మండలం తూడి గ్రామానికి చెందిన కొనిసి శివకుమార్ (27) పార్వతీపురం కేంద్రంలోని శనివారం టౌన్ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్‌కు ప్రేమ వ్యవహరమే కారణమని గ్రామస్థులు అంటున్నారు.

News November 2, 2024

ఎచ్చెర్ల: డిగ్రీ 3, 5 సెమిస్టర్ల ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3, 5 సెమిస్టర్ల ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ జి.పద్మారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్, నవంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు 3వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. జిల్లాలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలను నియమించారు.