India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యశాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 594 మంది CHO/MLHPల విధులపై ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 8PM FRSను రద్దు చేస్తూ దానిని అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా జీవో విడుదల చేశారు. మహిళా CHOలకు ఇబ్బందిగా ఉన్న ఈ ప్రక్రియను రద్దు చేయడంపై జిల్లా CHOలు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

*శ్రీకాకుళం-తిరుపతి హంసఫర్ రైలు ప్రారంభం
*లాజిస్టిక్ హబ్‌గా శ్రీకాకుళం: కేంద్ర మంత్రి రామ్మోహన్
*YSR మరణం వెనుక జగన్ హస్తం: ఎమ్మెల్యే కూన రవికుమార్
*టెక్కలి: పేరాడ తిలక్ విచారణ పూర్తి.. వీడిన సస్పెన్స్
*పోలీసుల విచారణకు హాజరైన టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్ తిలక్
*టీడీపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోంది: ధర్మాన
*అంబేడ్కర్ జయంతి జయప్రదం చేయాలి: కలెక్టర్

వజ్రపుకొత్తూరు(M) గుణుపల్లికి చెందిన వలస కూలీ కుమార్తె గుండుపల్లి స్వాతి తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో (MPC) 470కి 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్‌గా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ఈ మార్కులు సాధించగా, అందులో స్వాతి ఒకరు కావడం విశేషం. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన స్వాతిని ఉద్దాన ప్రజలు అభినందిస్తున్నారు. ఈ ఘనత జిల్లాకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AP: స్టడీ లీవ్ పేరిట ప్రైవేటు కాలేజీల్లో B.Ed, B.P.Ed చదువుతున్న టీచర్ల గురించి ఆరా తీసిన ఉన్నత విద్యామండలి విస్తుపోయే విషయాలు గుర్తించింది. వీరు క్లాసులకు హాజరు కాకుండా హాజరును మేనేజ్ చేసుకుంటున్నారు. ఇతర విద్యార్థులూ ఇలానే ఉన్నట్లు, ఏటా ఇదే తంతు నడుస్తున్నట్లు గమనించింది. ప్రమాణాలు దెబ్బతింటుండడంతో ఇకపై ఈ కాలేజీల్లో విద్యార్థులకు 2పూటలు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్సును అమలుచేయాలని నిర్ణయించింది.

శ్రీకాకుళం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఎచ్చెర్ల- శ్రీకాకుళానికి బైక్‌పై వస్తుండగా ఆదిత్య పార్క్ ఎదురుగా స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్దారు. మృతి చెందిన వ్యక్తి గార మండలం బైరికి చెందిన రంగా రావు కాగా, గాయపడిన లక్ష్మణ రావు ఈ వివరాలను తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి నేరుగా తిరుపతికి వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఇటీవల రైల్వే శాఖ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు)రైల్వే స్టేషన్-తిరుపతికి నడిచే హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్ ఇవాళ మధ్యాహ్నం 2-15ని.లకు ప్రారంభించనున్నట్లు ఆ కార్యాలయం నుంచి నిన్న ఓ ప్రకటన వచ్చింది. ఈ డైరెక్ట్ ట్రైన్ సర్వీస్‌కు ఎదురుచూస్తున్న జిల్లా వాసుల కల సాకారమవ్వనుంది.

హిరమండలంలోని దేవరశెట్టి వీధిలో శనివారం భారీ చోరీ జరిగిందంటూ జరిగిన ప్రచారంలో <<19625168>>బిగ్ ట్విస్ట్<<>> నెలకొంది. చోరీకి గురయ్యాయని బాధితులు తెలిపిన ఆభరణాలన్నీ ఇంటిలోనే ఉండటంతో అసలు చోరీయే జరగలేదని పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం భారీ చోరీ జరిగిందంటూ పోలీసులకు సమాచారం రావడంతో కొత్తూరు CI ప్రసాదరావు, SI మధుసూదనరావు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

రణస్థలం మండల పరిధిలోని రావాడ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కేంద్ర ప్రభుత్వ సంస్థలో SSC పరీక్షలో ఉద్యోగాలు సాధించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో లంక వెంకటేశ్ ఆదాయపు పన్ను శాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌గా, గొర్లె అప్పలనాయుడు జూనియర్ స్టాటిస్టికల్ అధికారిగా ఎంపికయ్యారు. ఇరువురి తల్లిదండ్రులు వ్యవసాయ చేస్తుంటారు. దీంతో వీరికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.

Sorry, no posts matched your criteria.