India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Ed 2వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ బుధవారం విడుదల చేశారు. అభ్యర్థులు నవంబర్ 4వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. రెగ్యులర్ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30, పరీక్ష ఫీజు రూ.1305తో కలిపి మొత్తం రూ.1335 చెల్లించాలని సూచించారు. పరీక్షలు నవంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి.
శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార, బహుదా, మహేంద్ర తనయ నదులు ఉన్నాయని, వాటి కాలువ గట్లు, మరమ్మతులు ఏమైనా ఉంటే తక్షణమే పూర్తి చేయాలని జిల్లా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కలెక్టరేట్ కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 08942-240557 ద్వారా తుఫాను నష్ట సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు.
ఆమదాలవలస మండలం గాజులపల్లి వలస వద్ద జగనన్న కాలనీలో పనిచేస్తున్న కార్మికుడు కర్రి లక్ష్మణ్ (24) బుధవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఇళ్ల పనులు చేస్తుండగా మోటర్ వేసేందుకు వెళ్లి ప్లగ్‌లో వైర్లు పెట్టే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తోటి కార్మికులు తెలిపారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సత్యనారాయణ వెల్లడించారు.
అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి గ్రామానికి చెందిన బందాపు శ్రీనిధి ఇండియన్ నేవీ ఉద్యోగానికి ఎంపికైంది. మంగళవారం విడుదలైన NAVY SSR -2024 తుది ఫలితాల్లో నేవీ ఉద్యోగం సాధించింది. నవంబర్ 11వ తేదీన ఒడిశా రాష్ట్రంలోని చిలకనేవీ ట్రైనింగ్ సెంటర్‌లో రిపోర్టు చేయనున్నట్లు ఆమె తెలిపారు. కాగా, శ్రీనిధిని పలువురు అభినందిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాను పట్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను తీవ్రత నేపథ్యంలో ఈనెల 24 నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయని, వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో సముద్ర, తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు.
కూటమి ప్రభుత్వము రాష్ట్రంలో ఆటవిక పరిపాలనను కొనసాగిస్తోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 120 రోజులలో దాదాపు 74 మంది యువతులు, బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని, ఇంత ఘోరమైన పాలన చేస్తున్న వీరు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రతీకార చర్యలకు వినియోగిస్తున్నారని దుయ్యబట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ మొదలైనందున రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ నెల 31 నాటికి ఓటరు జాబితా తయారు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ప్రతీవారం సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మంగళవారం మాట్లాడుతూ.. సాగు నీటి సంఘాల ఎన్నికల అంశంలో కిందిస్థాయి సిబ్బందికి ఆర్డీవోలు తగు శిక్షణ ఇవ్వాలన్నారు.
జిల్లాలో చేపడుతున్న ఆర్ అండ్ బి పనులు సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని R&B SEని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లాలో నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మందిరంలో JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన మంగళవారం సమీక్షించారు. బిల్లులు పెండింగులో ఉంటే ఆ జాబితాను అందజేయాలని SE ని ఆదేశించారు.
పలాసలో అక్కాచెల్లెళ్లైన ఇద్దరు ఇంటర్ విద్యార్థినులపై ముగ్గురు స్నేహితులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. నిందితులైన ఆ యువకులు ఇంటర్ తప్పి ఖాళీగా తిరుగుతున్నారు. ఈనెల 19న వారిలో ఒకరి బర్త్డే కావడంతో అమ్మాయిలను నిందితులు పార్టీ పేరుతో తీసుకెళ్లి మద్యం కలిపిన కూల్‌డ్రింక్ తాగించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. మరో బాలిక కూడా పార్టీకి వెళ్లగా ఆమె లైంగిక దాడి నుంచి తప్పించుకుంది.
Sorry, no posts matched your criteria.