India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జైలులో ఉన్న ముద్దాయిల సమస్యలు త్వరితగతన పరిష్కరించాలని జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోర్టులో పోలీస్ అధికారులతో సమావేశం మంగళవారం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, గర్భిణీలకు వీలైనంతవరకు న్యాయ సహాయం అందించడం జరుగుతుందన్నారు. దీనివలన జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గుతుందని పేర్కొన్నారు. ASP కె.వి.రమణ, డి.ఆర్.ఓ లావణ్య ఉన్నారు.

సింహాచలంలో ఏప్రిల్ 20న జరగనున్న లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లపై ప్రాథమిక సమీక్ష జరిగింది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ, సీపీ, జీవీఎంసీ కమిషనర్, దేవస్థానం ఈవో ఉన్నారు.

రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయించే సూర్యుడుని స్వర్ణంపై ఆవిష్కరించారు పలాస (M) కాశీబుగ్గకు చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి. రథసప్తమి అనే అక్షరాలను ఇందులో పొందిపరిచి ఆకట్టుకుంటున్నారు. ఈ లోగోను ఆదిత్యునికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ లోగో 100 మిల్లీ గ్రాముల బంగారం రేకుపై 5 గంటలు శ్రమించి తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు.

శ్రీకాకుళంలోని జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మకళా చిత్రకారుడు వాడాడ రాహూల్ పక్షి ఈకపై ఆరోగ్య భాస్కరుడు సూర్యనారాయణ స్వామి చిత్రాన్ని గీశారు. రథసప్తమి పండుగ సందర్భంగా రథంపై ఆదిత్యుని చిత్రం గీసినట్లు వెల్లడించారు. సూర్యుడి రథాన్ని లాగే ఏడు గుర్రాలలో ఒకదానికి అంకితం చేస్తూ ఈ చిత్రాన్ని గీశామన్నారు. ఇది చూపురాలను ఆకట్టుకుంటోంది.

రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్‌ను సిక్కోలు వాసులు ఆస్వాదిస్తున్నారు. సోమవారం ప్రారంభమైన తొలి రోజు దాదాపు 107 మంది హెలికాప్టర్‌లో విహరించగా రూ.2,43,400 వసూలయ్యాయి. హెలికాప్టర్ రైడర్లకు ప్రత్యేకంగా స్వామి వారి చిన్న విగ్రహం, ప్రసాదాన్ని అందజేస్తున్నారు. డచ్ బంగ్లా వద్ద ప్రత్యేకంగా బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రూ.2,200 చెల్లించి టికెట్ తీసుకోవాలి.

శ్రీకాకుళం జిల్లాలో కస్తూర్భాగాందీ బాలికల విద్యాలయాల్లో(KGVB) మొత్తం 57 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈనెల 11నే గడువు ముగియగా 20వ తేదీకి పెంచారు. టైప్-3లో 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు 18 ఏళ్ల వయసు కలిగినవారు మాత్రమే అప్లికేషన్లను జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్టీసీ, ఆరోగ్య శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా థియరీ పరీక్షలకు 39,383 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, 71 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించేలా ఈనెల 20న హాట్ ఎయిర్ బెలూన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆకాశ వీధిలో విహరించాలనుకునే వారి కోసం జిల్లాలోనే తొలిసారిగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో హాట్ ఎయిర్ బెలూన్ సదుపాయాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని, దీనికి టికెట్ ధర రూ.1000గా నిర్ణయించినట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.