India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం నగరంలో ఉన్న ప్రభుత్వ మహిళ కళాశాలలో పీజీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువు మంగళవారంతో ముగుస్తుంది. ఈ మేరకు అభ్యర్థులకు ఈనెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. MA, MSc కోర్సుల్లో ఖాళీలు ఉన్నట్లు ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు తెలిపారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ తెలిపారు.
జి.సిగడాంలో కేజీబీవీలో అదృశ్యమైన ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో దొరికినట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరు విద్యార్థులు హాస్టల్ నుంచి తప్పిపోయినట్లు గుర్తించారు. ఈ మేరకు అందిన సమాచారం ప్రకారం పోలీసులు గాలింపు ప్రారంభించారు. చివరికి ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో వారు దొరికారు. దీంతో విద్యార్థులు అదృశ్యం ఘటన సుఖాంతమైంది.
జిల్లాలో టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సుమారు 17 రోజుల పాటు రెండు సెషన్లలో జిల్లాలో మూడు కేంద్రాలు, ఒడిశా రాష్ట్రంలో మూడు కేంద్రాలలో ఈ పరీక్షలను నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో 16,185 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంఈఓ దాలినాయుడు తెలిపారు. ప్రాథమిక ‘కీ’ పై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఈ నెల 25 వరకు టెట్ వెబ్‌సైట్ https://aptet.apcfss.in/ ద్వారా స్వీకరించనున్నారు.
సాగునీటి సంఘాల ఎన్నికలకు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 344 సాగునీటి సంఘాలను గుర్తించారు. ఇప్పటికే ఆయా మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ సంఘాల పరిధిలో ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో నిర్ధారించిన ఆయకట్టు కింద ఉన్న సర్వే నంబర్ల వారీగా జాబితా నవీకరించాలన్నారు.
తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణారెడ్డి తెలిపారు. శ్రీకాకుళం డివిజన్ 9490610045, టెక్కలి డివిజన్ 8332843546, పలాస డివిజన్ 7382585630 హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయా డివిజన్ల పరిధిలో ప్రజలు ఏమైనా సమస్యలుంటే ఈ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
త్వరలో వెలువడనున్న డీఎస్సీ 2024 పరీక్ష ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు గడువును ఈ నెల 25వరకు పొడిగించినట్లు ITDA PO యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు JnanaBhumi portalలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో టీచింగ్, నాన్-టీచింగ్ మెరిట్ లిస్ట్ సబ్జెక్టుల వారిగా విడుదలైంది. ఈ మేరకు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను సోమవారం పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా మెరిట్ టీచింగ్, నాన్-టీచింగ్ అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో దగ్గరలో ఉన్న డీఈవో కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుందని డీఈవో తిరుమల చైతన్య పేర్కొన్నారు.
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి స్మారకోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాలు అట్టహాసంగా ప్రారంభిస్తామన్నారు. అనంతరం సమాజంలో పోలీసుల పాత్ర త్యాగాల గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడమే దీని ఉద్దేశం అన్నారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు సోమవారంతో ముగుస్తుంది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు ఇటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీగా ఈ నెల 20న ప్రకటించగా ఆదివారం కావడంతో నేడు సోమవారంతో గడువు ముగుస్తుంది. ప్రాక్టికల్స్ ఈనెల 29 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షా తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
నరసన్నపేట సత్యవరం సర్కిల్ హైవే వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. పోలాకి(M) జిల్లేడువలసకు చెందిన <<14408762>>భవ్య(17)<<>>, ఆమె తండ్రి గౌరేష్, రామరావు(48) శ్రీకాకుళం సమీపంలోని పరదేశిపాలెంలో పెళ్లికి వెళ్లారు. భవ్యకు సోమవారం పరీక్ష ఉండటంతో గౌరేష్ అక్కడే ఉండిపోయి.. భవ్యను రామారావుతో బైకుపై పంపగా లారీ ఢీకొని ఇద్దరూ చనిపోయారు. తన నిర్ణయంతోనే బిడ్డ చనిపోయిందని గౌరేశ్ బోరున విలపించారు.
Sorry, no posts matched your criteria.