Srikakulam

News July 8, 2024

REWIND: వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా పర్యటనలు

image

మాజీ ముఖ్యమంత్రి డా.వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో టెక్కలి, పలాస మీదుగా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించారు. 2006లో నందిగం మండలం దేవలభద్ర గ్రామంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. 2008 జనవరి 2వ తేదీన శ్రీకాకుళం రిమ్స్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన, 2008 ఏప్రిల్ 4న పలాస మండలం రేగులపాడులో ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జూన్ 14 ఆమదాలవలస మండలం కృష్ణాపురం వద్ద వంశధార కెనాల్ ప్రారంభించారు.

News July 8, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి దశావతారాల్లో జగన్నాథుడు

image

జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం, టెక్కలి, ఇచ్చాపురం, నరసన్నపేట ప్రాంతాల్లో జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర రథయాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు సుమారు 11 రోజుల పాటు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 8న మత్స్యవతారం, 9న కూర్మావతారం, 10న వరాహవతారం, 11,12న నృసింహావతారం, 13న వామనావతారం, 14న పరశురామవతారం, 15న శ్రీరామ అవతారం, 16న బలరామ-శ్రీకృష్ణావతారం, 17న తొలి ఏకాదశి రోజున శేష పాన్పు అవతారంలో దర్శనమిస్తారు.

News July 8, 2024

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

image

కేంద్ర ప్రభుత్వం పరిధిలో అగ్నివీర్, అగ్నిపథ్ స్కీం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై 8 నుంచి 28వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ వెల్లడించారు. ఈ మేరకు అవివాహిత యువత ఇంటర్, 10వ తరగతిలో 50 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News July 8, 2024

శ్రీకాకుళం: ‘కల్కి బుజ్జి’ కారు పర్యటన రద్దు

image

శ్రీకాకుళం జిల్లాల్లో ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని బుజ్జి కారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో ప్రదర్శన చేపట్టారు. అయితే సోమవారం శ్రీకాకుళం జిల్లాకు బుజ్జి కారు రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా కారు విజయనగరం నుంచి వెనక్కి వెళ్లిపోయినట్లు జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం తెలిపారు.

News July 8, 2024

ఎచ్చెర్ల: ప్రభుత్వ ITIలో 10న ఉద్యోగ మేళా

image

ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 10వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ITI ప్రవేశాల జిల్లా కన్వీనర్ సుధాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ITI ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణులైన వారు ఈ మేళాకు హాజరు కావచ్చని చెప్పారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు 10వ తేది ఉదయం 9 గంటలకు విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు బయోడేటా, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.

News July 8, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి ఉచితంగా ఇసుక

image

నేటి నుంచి నూతన ఇసుక విధానం అమల్లోకి రానుంది. జిల్లాలో రెండు నిల్వకేంద్రాల నుంచి ఇసుక సరఫరా చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిబంధనలు విడుదల చేసింది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా నిల్వ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుకను టన్ను రూ.340 ధరకు సామాన్యులకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News July 8, 2024

ఆమదాలవలస: కుప్పిలికి రాష్ట్ర స్థాయి బహుమతి

image

ఆమదాలవలస పట్టణానికి చెందిన సాహితీవేత్త, కవి, తెలుగు విశ్రాంత ఉపాధ్యాయుడు కుప్పిలి వెంకటరాజారావుకు రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. నెల్లూరుకు చెందిన అక్షరం సంస్థ గతనెలలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన కవితల పోటీల్లో రాజారావు రచించిన ‘ఆ వేలి చుక్కకు ఎప్పుడూ చుక్కెదురే’ అనే
కవితకు ప్రథమ బహుమతి లభించినట్లు రాజారావు ఆదివారం తెలిపారు.

News July 7, 2024

శ్రీకాకుళం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

* ప్రతి ఎకరానికి సాగునీరు: కలెక్టర్
* 104 సిబ్బంది సమస్యలను పరిష్కరించండి: వైద్య సిబ్బంది
* థాంక్యూ సీఎం కార్యక్రమంలో రక్తదానం
* విధుల్లో నిర్లక్ష్యం.. ఉద్యోగి సస్పెండ్
* కేజీబీవీ సిబ్బందిపై అధికారుల ఆగ్రహం
* రెండు వరుస అల్పపీడనాలు: నిపుణులు
* నెల రోజుల్లో సాగునీరు అందించాను: గౌతు శిరీష
* మలేరియాతో చిన్నారి మృతి

News July 7, 2024

శ్రీకాకుళం: విధుల్లో నిర్లక్ష్యం.. ఉద్యోగి సస్పెండ్

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని సాంఘీక సంక్షేమ బాలురు కళాశాల వసతిగృహంలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి డీ.ఎర్రన్నాయుడును సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టి.. రుజువవ్వడంతో ఆదివారం ఆయనని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

News July 7, 2024

ఆమదాలవలస: కుప్పిలికి రాష్ట్ర స్థాయి బహుమతి

image

ఆమదాలవలస పట్టణానికి చెందిన సాహితీవేత్త, కవి, తెలుగు విశ్రాంత ఉపాధ్యాయుడు కుప్పిలి వెంకటరాజారావుకు రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. నెల్లూరుకు చెందిన అక్షరం సంస్థ గతనెలలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన కవితల పోటీల్లో రాజారావు రచించిన ‘ఆ వేలి చుక్కకు ఎప్పుడూ చుక్కెదురే’ అనే
కవితకు ప్రథమ బహుమతి లభించినట్లు రాజారావు ఆదివారం తెలిపారు.