Srikakulam

News July 6, 2024

శ్రీకాకుళం జిల్లా నేటి వార్తలు

image

*అక్రమ ఇసుక తవ్వకాలపై పిర్యాదు చేయండి: కలెక్టర్
* కొరియర్ ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తత: ఎస్పీ
* టెక్కలిలో 9న ఫార్మా ఉద్యోగుల జాబ్ మేళ
* B. Ed సెమిస్టర్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల : డీన్
* హెల్మెట్ లేని ప్రయాణం.. రూ .1000 జరిమానా
* ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి: జేసీ
* ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక పాలసీ

News July 6, 2024

శ్రీకాకుళం: ఒక్కొక్కరిగా ఆస్పత్రిపాలవుతున్న విద్యార్థులు

image

కోటబొమ్మాలి కేజీబీవీ పాఠశాల విద్యార్థులు గత 2రోజులుగా ఒక్కొక్కరిగా తీవ్ర అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి వరకు పాఠశాలలో చదువుతున్న 20మంది విద్యార్థులకు తీవ్రంగా వాంతులు, విరేచనాలయ్యి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం 12 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

శ్రీకాకుళం: ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక పాలసీ

image

శనివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉచిత ఇసుక నూతన పాలసీ విధానం ఈనెల 8 నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుందని పేర్కొన్నారు. భూగర్భ గనుల శాఖకు సంబంధించి నూతన ఇసుక విధానంపై వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు, ఎస్పీలకు, భూగర్భ గనుల శాఖ అధికారులకు వివరించారు.

News July 6, 2024

శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తితో కలెక్టర్ భేటీ

image

శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానాతో నూతన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆవరణలో ఆయనని కలిసి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా గురించి ఇరువురు చర్చించారు.

News July 6, 2024

పాతపట్నం: మిగులు సీట్ల భర్తీకి ఆహ్వానం

image

పాతపట్నం డా.బీ.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్లో మిగిలిన సీట్లు 9వ తేదీన భర్తీ చేయునట్లు ప్రిన్సిపల్ వీ.అర్చన తెలిపారు. 5వ తరగతికి సంబంధించిన సీట్లను లాటరీ రూపంలో కేటాయించబోతున్నట్లు వివరించారు. ఇంటర్మీడియట్‌కు మార్కుల ఆధారంగా, మొదటిగా పరీక్ష రాసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు. వివరాలకోసం పాఠశాలను సంప్రదించాలని కోరారు.

News July 6, 2024

శ్రీకాకుళం: ‘వైయస్ఆర్ జయంతిని వేడుకగా నిర్వహించాలి’

image

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతిని ఈనెల 8న ఘనంగా నిర్వహించాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రక్తదానం, స్కూల్లో పుస్తకాల పంపిణీ, మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైకాపా కుటుంబ సభ్యులందరికీ పిలుపునిచ్చారు.

News July 6, 2024

శ్రీకాకుళం: హిజ్రాలకు గుర్తింపు కార్డులు

image

శ్రీకాకుళం జిల్లాలో గుర్తింపు కార్డులు లేని హిజ్రాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఐడీ కార్డు, వైద్య ధ్రువపత్రాలను అందిస్తామని వయోవృద్ధుల సహాయ సంచాలకురాలు కవిత శనివారం తెలిపారు. గుర్తింపు కార్డులు లేని హిజ్రాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ పథకాలకు ఈ గుర్తింపు కార్డు చాలా అవసరమని ఆమె తెలిపారు.

News July 6, 2024

హైదరాబాద్‌లో శ్రీకాకుళం వాసి నురగలు కక్కుకుని మృతి

image

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురానికి చెందిన డ్రైవర్ ఢిల్లీ రావు(38) హైదరాబాద్‌లో నురగలు కక్కుకుని మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. నేపాల్ నుంచి చీపురు కట్టల లోడుతో హైదరాబాదులోని జవహర్‌నగర్‌కు చేరుకున్నారు. లోడ్ దించిన అనంతరం డ్రైవర్‌ను లేపుదామని క్లీనర్ వెళ్లగా నురగలు కక్కి మృతిచెందాడు. అంతకుముందు అతడు 2 మాత్రలు వేసుకుని, ENO తాగాడని క్లీనర్ తెలిపాడు. పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

News July 6, 2024

కొరియర్ ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సైబర్ నేరగాళ్లు చేసే కొరియర్ ఫ్రాడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాధిక సూచించారు. సైబర్ నేరగాళ్లు కాల్ చేసి తాను పోలీస్ అధికారినని మీ పేరు మీద వచ్చిన కొరియర్లో అక్రమ ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలు ఉన్నాయని, దాని కారణంగా మీ మీద FIR నమోదు చేశామని చెప్పి, మోసం చేస్తున్నారని ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

News July 6, 2024

కంచిలి: జగన్నాథ స్వామి ఉత్సవ విగ్రహాలు సిద్ధం

image

కంచిలి మండల కేంద్రంలో ఆదివారం రోజున నిర్వహించే జగన్నాథ స్వామి రథయాత్రకు ఉత్సవ విగ్రహాలను శనివారం రోజున సిద్ధం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ మేరకు మేళ తాళాలు, గోష్ఠితో పాటు సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో అనేక చోట్ల జగన్నాథ యాత్ర నిర్వహించనున్నారు.