India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళంలోని గవర్నమెంట్ DLTC కాలేజీలో ఈనెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ హబ్ కోఆర్డినేటర్ N.శేషగిరి తెలిపారు. పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI, పూర్తి చేసి 18-24 ఏళ్లు కలిగిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB 3 సంవత్సరానికి సంబంధించి 2, 4 సెమిస్టర్ల పరీక్ష టైం టేబుల్ విడుదలైంది. వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.. 2వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయన్నారు.
సంతబొమ్మాలి మండలం కుమందానివానిపేట గ్రామంలో ఇద్దరు చిన్నారులకు తల్లి విషమిచ్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తల్లి దుర్గ సైతం చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున 3 గంటలకు మృతిచెందినట్లు టెక్కలి జిల్లా ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. చిన్నారుల మృతి అనంతరం ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్చగా చనిపోయింది.
పలాస నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరులపై దాడి జరగ్గా పలువురు గాయపడ్డారు. బాధితుల వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం పాత టెక్కలి గ్రామానికి చెందిన గంగయ్య గతంలో టీడీపీ కోసం పనిచేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామానికి చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలు గంగయ్యతో పాటు ఆయన భార్యపై దాడి చేశారు. అడ్డుకున్న కుమారుడు గిరిపై కూడా దాడి చేయడంతో గాయపడ్డారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సాగనీటి సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నందున నీటి తీరువా వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులు వేగవంతం చేయడంతో పాటు పనిదినాలు జనరేట్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్లో మంగళవారం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కేజీబీవీల్లో నాన్ టీచింగ్ పోస్టులు దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారంతో గడువు ముగుస్తుంది. ఈ మేరకు మొత్తం జిల్లాలో 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు నేటి సాయంత్రంలోగా ఆయా మండలాల్లో ఉన్న ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి వేతనంగా నెలకు రూ.15,000 చెల్లించనున్నారు. కనీస వయస్సు 21 నుంచి 42 మధ్యలో ఉండాలి.
15 సంవత్సరాలు నిండిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. వయోజన విద్యపై కలెక్టర్ ఛాంబర్‌లో మంగళవారం ఆయన సమీక్షించారు. ఉల్లాస్ అనే కార్యక్రమం ద్వారా ప్రధానంగా స్వయం సహాయక సంఘాల లబ్ధిదారులు, ఆయాలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే నైట్ వాచ్ మన్‌లు, తదితరులు దృష్టి సారించాలన్నారు.
సంతబొమ్మాళి మండలం కుమందానివానిపేటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన డెక్కల రాజు, దుర్గ దంపతుల కుమారులు బాలాజీ(10), రిషి(8) మంగళవారం ఉదయం నాటికి అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఉదయం ఇంట్లో ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా పడి ఉండడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల మృతికి కారణాలు తెలియరాలేదు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు వెలువడ్డాయి. గజపతినగరం ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి వర్గంలో ఉన్న కొండపల్లి శ్రీనివాస్‌ను జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా నియమించారు. జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని డా.బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా నియమించారు. ఈ మేరకు ఆయా మంత్రులకు ఇన్‌ఛార్జ్ స్థానాలను కేటాయించారు.
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా “మినీ జాబ్ మేళా” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా మేనేజర్ ఉరిటి సాయికుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18న ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేళాలో మూడు కంపెనీలు పాల్గొంటున్నాయని సుమారు 50 ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.