India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డాక్టర్. బీఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల తేదీలను యూనివర్సిటీ డీన్ గురువారం విడుదల చేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.
ఆమదాలవలస పెద్ద జొన్నవలస గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సివిల్ సప్లయర్స్ ఎండీ మంజీర్ జిలాని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి ఫర్మానా అహ్మద్ ఖాన్, ఎమ్మార్వో రాంబాబు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం గొప్పిలి గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో పెద్దపులి దాడులు చేసిందని పాతపట్నం అటవీశాఖ సెక్షన్ రేంజర్ పట్ట అమ్మి నాయుడు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. పెద్దపులి ప్రస్తుతం ఒడిశా ప్రాంతానికి తరలి వెళుతున్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో గొప్పిలి వద్ద రెండు ఆవులపై దాడి చేయడంతో మృతి చెందాయని ఆయన స్పష్టం చేశారు.
గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. పాతపట్నం మండలం తిమరా గ్రామ సమీపంలో ఒక ఆవుపై దాడి చేసి దాన్ని సమీప తోటల్లోకి లాక్కెళ్లి తినేసిన ఆనవాళ్లను మంగళవారం అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. అనంతరం రొంపివలస మీదుగా కొరసవాడ గ్రామం వైపు పెద్దపులి వెళ్లినట్లు అడుగుజాడలు గుర్తించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం అటవీశాఖ రేంజ్ అధికారి అమ్మన్నాయుడు తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల్లో డిసెంబర్ నాటికి మంచినీరు, మరుగుదొడ్లు ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. జిల్లాలో మలేరియా, డెంగీ లాంటి కేసులు నమోదు కాకూడదని స్పష్టమైన విధి విధానాల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలన్నారు. సూర్యఘర్ పథకానికి విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించి, అపోహలు తొలగించాలని సూచించారు. పన్నుల వసూళ్లలో సెక్రటరీలు అలసత్వం చూపరాదన్నారు.
శ్రీకాకుళం నుంచి ఉపాధి కోసం సౌదీ వెళ్లిన 22 మంది కార్మికులు యాజమాన్యం చేతులో మోసపోవడం బాధాకరమని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సౌదీ అరేబియా నుంచి క్షేమంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు చొరవ చూపాలని కోరారు. అనంతరం వినతిపత్రం అందజేసిన మంత్రి ఎంబసీకి సమాచారం అందించి, వారి బాగోగులను చూడాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది యువకులు సౌదీ అరేబియాలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం ఉదయం మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఏజెంట్ల ద్వారా మోసపోయిన జిల్లా యువకులను తిరిగి సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబుతో ఈ అంశంపై చర్చించి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తామని చెప్పారు.
మినిమం టైం స్కేల్(ఎం.టీ.ఎస్) పద్ధతిలో పనిచేస్తున్న 1988 బ్యాచ్ ఉపాధ్యాయులకు పాలకొండ బాలురు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బదిలీలు పూర్తయ్యాయని ఉప విద్యాశాఖ అధికారి పర్రి కృష్ణమూర్తి తెలిపారు. మొత్తం 35 ఖాళీలకు గాను 32 పోస్టులు భర్తీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇద్దరూ ఎంటీఎస్‌లు బదిలీలకు అంగీకరించకపోగా ఒక ఎస్జీటీ ఉపాధ్యాయుడు అందుబాటులో లేనందున ప్రస్తుతం మూడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
SC, ST అట్రాసిటీ కేసులో పాతపట్నానికి చెందిన గేదెల అమరావతి అనే మహిళకు శ్రీకాకుళం SC, ST కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. SI లావణ్య వివరాల ప్రకారం.. యశోదానగర్‌లో ఇరురుపొరుగు ఇళ్లలో ఉంటున్న చిన్నమ్మడు, గేదెల అమరావతికి పిట్టగోడపై పూల మొక్కలకు నీరు పోసే విషయంలో వివాదం తలెత్తింది. తన ఇంట్లో నీరు పడుతున్నాయంటూ ప్రశ్నించిన చిన్నమ్మడుని కులం పేరుతో అమరావతి దూషించి దాడి చేయడంతో 2020లో కేసు నమోదైంది.
పాతపట్నం పరిధిలోని చోడసముద్ర ప్రాంతంలో ఇటీవల పులి సంచారం విషయం తెలిసిందే. గడిచిన మూడున్నరేళ్లుగా ఇదే పులి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, ఒడిశా ప్రాంతాల్లోని అడవుల్లో సంచరిస్తోందని జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేష్, సిబ్బంది గుర్తించారు. పులి అడుగుల జాడతో ఇదే పులి ఇక్కడ సంచరిస్తోందని నిర్ధారించారు. ప్రస్తుతం అటవీ సిబ్బంది పులి పాదముద్రలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
Sorry, no posts matched your criteria.