India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో రానున్న 3 రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 3, 4, 5 తేదీల్లో జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. రేపు మబ్బులతో కూడి అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.
జాతీయస్థాయి ఉపాధ్యాయుల అవార్డ్స్-2024 సంబంధించి అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఇందులో దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. అర్హత గల ఉపాధ్యాయులు ఈనెల 15వ తేదీలోగా http://nationalawardstoteacherseducation.gov.in వెబ్‌సైట్లో అప్లై చేసుకోవాలని సూచించారు.
పింఛను పంపిణీ లబ్ధిదారుల సంఖ్యలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే టాప్‌లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 3,19,147 ఉండగా ఇప్పటి వరకు 99.21% లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. దీని తర్వాత విజయనగరం రెండో స్థానంలో ఉంది. కాగా ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో 3,16,528 మందికి పెన్షన్ పంపిణీ చేశారని అధికారులు తెలిపారు.
* నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణకు చర్యలు: కలెక్టర్ * శ్రీకాకుళం కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్ నియామకం * జూలై 4న దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్: ఎస్‌ఎఫ్‌ఐ * కౌలు రైతులకు గుర్తింపు కార్డు: వ్యవసాయ అధికారి * ప్రతిభ చూపిన ITI విద్యార్థి* రైతు బజార్లకు పూర్వ వైభవం: మంత్రి అచ్చెన్న* మహిళను హత్య చేసి.. లొంగిపోయాడు
ఏపీఈపీడీసీఎల్ వినియోగదారులు విద్యుత్ బిల్లులను ఏపీఈపీడీసీఎల్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో చెల్లించాలని సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ మంగళవారం వెల్లడించారు. ఆర్బీఐ మార్గదర్శకాలతో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలో విద్యుత్ బిల్లు ఇకనుంచి చెల్లించలేరని తెలిపారు. సంస్థకు చెందిన APEPDCL Eastern Power యాప్ ప్లేస్టోర్ డౌన్‌లోడ్ చేసుకుని లేదా వెబ్‌సైట్‌లో బిల్లు చెల్లించాలని కోరారు.
కూరగాయల ధరల పెరుగుదల నియంత్రణతో పాటు రైతులకు గిట్టుబాటు ధర దక్కే విధంగా రైతు బజార్లలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్వ వైభవం ఉట్టిపడేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. ధరల పెరుగుదల, దిగుబడులపై ఆయన చర్చించారు.
పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లికి చెందిన రాజేశ్వరి అనే మహిళ మంగళవారం దారుణహత్యకు గురైంది. పోలీసుల వివరాలు.. నర్సన్నపేటకు చెందిన ఆటో డ్రైవర్ గోపాలరావు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం డెడ్‌బాడీని ఆటోలో పొందూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయాడు. 3ఏళ్లుగా అతడితో చనువుగా ఉండి.. ఇప్పుడు దూరం పెడుతోందని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ కోర్సుల ప్రవేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ డా.కె.సూర్యచంద్రరావు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులకు ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని వివరించారు. ఈ నెల 10వ తేదీ వరకు విద్యార్థినులు ఓఏఎండీసీ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ నెల 5న కళాశాలలో ధ్రువపత్రాలు పరిశీలిస్తామన్నారు.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 64వేల ఎకరాల పాత ఆయకట్టును సస్యశ్యామలం చేస్తున్న తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఈనెల 13న సాగునీరు విడుదల చేయనున్నట్లు జలవనరులశాఖ డీఈఈ ధమలపాటి రవికుమార్ తెలిపారు. ఈ ఖరీఫ్‌లో వీరఘట్టం, పాలకొండ, బూర్జ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, వంగర మండలాలకు సాగునీటిని ప్రణాళిక బద్ధంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బేరిపేటకు చెందిన కోరాడ హరీష్ కుమార్ కేదార్నాథ్ యాత్రలో జనసేన జెండాను ఎగరవేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21 సీట్లకు 21 గెలవడం, అలాగే తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినందుకు ఈ యాత్ర ప్రారంభించానని తెలిపాడు.
Sorry, no posts matched your criteria.