Srikakulam

News March 19, 2024

శ్రీకాకుళం: పది పరీక్షలకు 446 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పది పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు మంగళవారం ఒక తెలిపారు. మొత్తం 29,108 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 28,662 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 446 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

News March 19, 2024

శ్రీకాకుళం జిల్లాలో రేపు పిడుగులతో భారీ వర్షాలు

image

ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, మంగళవారం రాజాం, పలాస, సీతంపేట, టెక్కలి ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రేపు పిడుగులు పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

News March 19, 2024

శ్రీకాకుళం: హిందీ పరీక్షకు 458మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంగళవారం పదో తరగతి హిందీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు తెలిపారు. జిల్లాలో 145 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహింగా..458 మంది విద్యార్థులు హాజరు కాలేదని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకుంటున్నారని తెలిపారు.

News March 19, 2024

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వర్షాలు

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వర్షం కురుస్తున్నాయి. జిల్లాలోని పొందూరు, చిలకపాలెం, గంగువారి సిగడాం, ఆమదాలవలస పలు మండలాల్లో ఈదురు గాలులు ఉరుములతో వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇన్ని రోజులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది.

News March 19, 2024

శ్రీకాకుళం: ఏప్రిల్15 నుంచి చేపల వేట నిషేధం

image

తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపలవేటను నిషేధిస్తారు. ఏపీతోపాటు తీరప్రాంతం విస్తరించి ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉందని మత్స్యశాఖ జేడీ విజయకృష్ణ తెలిపారు.

News March 19, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఈవోపై కమిషనర్ ఆగ్రహం

image

ఆరసవల్లి సూర్యనారాయణ ఆలయ ఈవో ఎస్.చంద్రశేఖర్‌రెడ్డిపై దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ మండిపడ్డారు. రావివలసకు చెందిన అటెండర్‌ శ్రీనివాసరావు డిప్యూటేషన్‌పై ఆదిత్యాలయంలో పనిచేస్తున్నారు. నెల రోజుల కిందట గడువు ముగియడంతో ఆయన మరోసారి కమిషనర్ ఆర్డర్ తీసుకుని వెళ్లగా ఆరసవెళ్లి ఈవో విధుల్లోకి తీసుకోలేదు. విషయం కమిషనర్‌కు తెలిసి అటెండర్‌ను తక్షణమే విధుల్లోకి తీసుకోకుంటే సస్పెండ్ చేస్తా అంటూ హెచ్చరించారు.

News March 19, 2024

శ్రీకాకుళం: పది పరీక్షలకు 458 గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పది పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మొత్తం 29,243 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 28,785 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 458 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

News March 19, 2024

శ్రీకాకుళం జిల్లాలో రేపు భారీ వర్షాలు

image

ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. దక్షిణ తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా.. పశ్చిమ విదర్భ వివిధ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీంతో ఝార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు మరో ద్రోణి వ్యాపించింది. వీటి ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

News March 19, 2024

శ్రీకాకుళం: కోడ్ నేపథ్యంలో లైసెన్సు తుపాకీలు స్వాధీనం

image

ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్నందున లైసెన్స్ ఉన్న తుపాకులను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ సూచించారు. బ్యాంకు భద్రత సిబ్బంది, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సిబ్బంది వద్ద ఉన్న 75 మినహా మిగిలినవి అప్పగించాలన్నారు. జిల్లాలో 254 లైసెన్సులపై 273 తుపాకీలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఉన్న మిగతా తుపాకిలు అప్పగించాలన్నారు.

News March 18, 2024

సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసిన శ్రీకాకుళం ఎస్పీ

image

జిల్లా సరిహద్దుగా ఉన్న కంచిలి మండలంలో గాటి ముకుందపురం, ఇచ్ఛాపురం మండలంలో పురుషోత్తపురం అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక, అదనపు ఎస్పీ జి.ప్రేమ కాజల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల రాకపోకలు, తనిఖీలను కాసేపు పరిశీలించి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చెక్ పోస్టు సిబ్బంది ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.