Srikakulam

News January 20, 2026

SKLM: సరికొత్త అనుభూతి.. నేటి నుంచి హాట్ ఎయిర్ బెలూన్ సందడి

image

రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించేలా ఈనెల 20న హాట్ ఎయిర్ బెలూన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆకాశ వీధిలో విహరించాలనుకునే వారి కోసం జిల్లాలోనే తొలిసారిగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో హాట్ ఎయిర్ బెలూన్ సదుపాయాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని, దీనికి టికెట్ ధర రూ.1000గా నిర్ణయించినట్లు వెల్లడించారు.

News January 19, 2026

టెక్కలి: ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపిక

image

టెక్కలి మండలం శాసనం గ్రామానికి చెందిన కె.జ్ఞానేశ్వరరావు అనే యువకుడు ఒకేసారి మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఇండియన్ ఆర్మీ(టెక్నీకల్), SSC(CISF-GD), ఇండియన్ ఎయిర్ ఫోర్స్(అగ్నివీర్) ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. యువకుడు తండ్రి సాంబమూర్తి రైతు కాగా తల్లి వరలక్ష్మీ గృహిణి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి ఒకేసారి మూడు కేంద్ర బలగాల్లో ఉద్యోగాలు సాధించడంపై యువకుడిని పలువురు ప్రశంసించారు.

News January 19, 2026

టెక్కలి: తాపీ మేస్త్రి కుమారుడికి రెండు ఉద్యోగాలు

image

టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ దీపావళిపేట గ్రామానికి చెందిన కె.సాయి కుమార్ ఒకేసారి రెండు సైనిక ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. SSC(GD-ITBP), ఆర్మీ(అగ్నివీర్) టెక్నీషియన్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యాడు. యువకుడి తండ్రి బైరాగి తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నారు. పేద యువకుడు ఒకేసారి సైన్యంలో రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడంపై గ్రామస్థులు, స్నేహితులు అభినందించారు.

News January 19, 2026

అరగంటలోనే సూర్య భగవానుడి దర్శనం: SKLM కలెక్టర్

image

రథసప్తమి పర్వదినాన అరసవల్లికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గతంలో 45 నిమిషాలు పట్టే దర్శన సమయాన్ని ఈసారి 30 నిమిషాలకే తగ్గించేలా 6 ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు. ఉచితంతోపాటు రూ.100, రూ.300,రూ.500 టికెట్లు కూడా ఆన్లైన్, ఆఫ్లైన్లో అందుబాటులో ఉన్నాయన్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు రావచ్చన్నారు.

News January 19, 2026

ఉచిత పశువైద్య శిబిరాల పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి అచ్చెన్న

image

ఏపీలో ఉచిత పశు వైద్య శిబిరాలు తేదీల షెడ్యూల్ పోస్టర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం తాడేపల్లిలోని కార్యాలయంలో ఆవిష్కరించారు. రైతులు శ్రేయస్సుకు కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే పాడి పశువులను పోషించేందుకు ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పాడి సంపద అభివృద్ధి చేయాలని తెలియజేశారు.

News January 19, 2026

మెళియాపుట్టి: ‘వినోదం కోసం వెళ్తే విషాదం ఆవరించింది’

image

వినోదం కోసం పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఆడలి వ్యూ పాయింట్‌కు వెళ్లిన కుటుంబంలో విషాదం నింపింది. నిన్న సాయంత్రం ఏజెన్సీలో ప్రకృతి అందాలను చూసి తిరిగి ఆటోలో వస్తుండగా..వారి వాహనం ఆడలి వ్యూ పాయింట్ వద్ద రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంద్రరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు మెళియాపుట్టి మండలానికి చెందిన వారిగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 19, 2026

SKLM: నేటి నుంచి సురభి నాటక వైభవం

image

కళల కాణాచి శ్రీకాకుళం నగరంలో పౌరాణిక నాటక సందడి మొదలవనుంది. అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రసిద్ధ సురభి నాటక సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరగనున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఈ నాటకోత్సవాలు జరుగుతాయి. స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియం వేదికగా సోమవారం (జనవరి 19) నుంచి ఐదు రోజుల పాటు ప్రదర్శనలు కొనసాగనున్నాయి.

News January 19, 2026

SKLM: నేడే హెలికాప్టర్ రైడ్..టికెట్ ధర ఎంతంటే?

image

రథసప్తమి వేడుకల సందర్భంగా సోమవారం (జనవరి 19) నుంచి హెలికాప్టర్ రైడింగ్ జరుగనుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద ఆఫ్‌లైన్‌లోనే 3 కౌంటర్ల ద్వారా టికెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు. హెలికాప్టర్ రైడింగ్ చేసేవారు రూ.2,200 టికెటు తీసుకోవాలన్నారు. ఉదయం 10 గంటల నుంచే మొదలై, రోజుకు 200-250 మంది వరకు రైడ్‌లో వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.

News January 19, 2026

ఆదిత్యుని దర్శనానికి టికెట్ బుకింగ్ ఇలా!

image

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిత్యుని దర్శనానికి భక్తుల సౌకర్యార్థం ఈ నెల 25న ప్రత్యేక స్లాట్లను ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వహణాధికారి కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. దర్శన టికెట్లకు అధికారిక వెబ్‌సైట్ https://www.aptemples.gov.in లేదా ‘మన మిత్ర’ వాట్సాప్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందవచ్చన్నారు. ఈ నెల 19-23 వరకు రోజుకు 450 చొప్పున, 24వ తేదీన 1,750 టికెట్లు ఉంటాయన్నారు.

News January 19, 2026

SKLM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు

image

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి సమస్యలను నేరుగా, ఆన్‌లైన్‌లోని Meekosam.ap.gov.inలో సమర్పించుకోవాలన్నారు. అర్జీలు సమర్పించిన వారు వాటి స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.